-Advertisement-

డిగ్రీ అర్హతతో కోల్‌ ఇండియాలో 640 MT పోస్టులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా!

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS
Peoples Motivation

డిగ్రీ అర్హతతో కోల్‌ ఇండియాలో 640 MT పోస్టులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా!

మహారత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా ఉన్న సీఐఎల్ కేంద్రాలు, అనుబంధ సంస్థల్లో ఉన్న 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్ చేసి, గేట్‌ 2024లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS

విభాగాల వారీగా పోస్టుల వివరాలు

మైనింగ్ ఇంజినీరింగ్‌ - 263 పోస్టులు

సివిల్ ఇంజినీరింగ్‌ - 91 పోస్టులు

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 102 పోస్టులు

మెకానికల్ ఇంజినీరింగ్ - 104 పోస్టులు

సిస్టమ్ ఇంజినీరింగ్ - 41 పోస్టులు

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యునికేషన్‌ - 39 పోస్టులు

మొత్తం పోస్టులు - 640

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు

జనరల్ - 190 పోస్టులు

ఈడబ్ల్యూఎస్‌ - 43 పోస్టులు

ఓబీసీ - 124 పోస్టులు

ఎస్టీ - 34 పోస్టులు

ఎస్సీ - 67 పోస్టులు

విద్యార్హతలు (Educational Qualification)

అభ్యర్థులు కనీసం 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్‌, ఎలక్ట్రికల్‌, మైనింగ్ ఇంజినీరింగ్‌) చేసి ఉండాలి. లేదా

బీఈ, బీటెక్‌ (ఐటీ, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్) చేసి ఉండాలి. లేదా ఎంసీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితోపాటు గేట్-2025 స్కోర్ ఉండాలి.

వయోపరిమితి (Age Limit)

అభ్యర్థుల వయస్సు 2024 సెప్టెంబర్‌ 30 నాటికి 30 ఏళ్లు మించి ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు రుసుము (Application Fee)

జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1180 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ (Selection Process)

గేట్-2025 స్కోర్‌, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపిక చేస్తారు. వీరికి ఒక సంవత్సరం పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.

జీతభత్యాలు (Salary)

మేనేజ్‌మెంట్ ట్రైనీలకు నెలకు రూ.50,000 - రూ.1,60,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం (Application Process)

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కోల్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 అక్టోబర్‌ 29

దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 నవంబర్‌ 28

ముఖ్యాంశాలు (Key Words):

కోల్ ఇండియా లిమిటెడ్‌ 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

డిగ్రీ, బీటెక్‌, బీఈ, గేట్ స్కోర్‌లు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు నవంబర్ 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్సైట్ (Official Website): https://www.coalindia.in/


Comments

-Advertisement-