Agniveer: అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు
Agniveer: అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు
- ఆర్మీ నియామక అధికారి కల్నల్ పునీత్ కుమార్
కర్నూలు, అక్టోబర్ 19 (పీపుల్స్ మోటివేషన్):- నవంబర్ 10 నుండి 15 వరకు నిర్వహించనున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని గుంటూరు ఆర్మీ నియామక కార్యాలయం డైరెక్టర్ కల్నల్ పునీత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు..
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ 10TH ట్రేడ్స్‌మన్, అగ్నివీర్ 8TH ట్రేడ్స్‌మన్ నియామకాలకు సంబంధించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నవంబర్ 10 నుండి 15 వరకు కడప DSA స్టేడియంలో జరుగుతుందని, ఇందులో ఇతర జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన అభ్యర్థులు కూడా ఇందులో పాల్గొంటారన్నారు.
ఆర్మీరిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఫెయిర్ గా, పారదర్శకంగా జరుగుతుందని ఆర్మీ నియామక అధికారి తెలిపారు.. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేస్తామని వచ్చే మోసగాళ్ల నుండి దరఖాస్తుదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు..కష్టపడిన వారికి, మెరిట్ ప్రకారమీ ఎంపిక జరుగుతుందని, మధ్య దళారులు, ఏజెంట్లను నమ్మవద్దని ఆయన సూచించారు.. ఆలాంటి ఏజెంట్లు/ఏజెన్సీల ఆకర్షణలో పడవద్దని ఆర్మీ నియామక అధికారి సూచించారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పొందిన అడ్మిట్ కార్డులను, www.joinindianarmy.nic.in లో అప్లోడ్ చేయబడిన 12 ఫిబ్రవరి 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ సైట్ కి సంబంధించిన అన్ని పత్రాలు అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకొని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.