-Advertisement-

AP Liquor Policy: ప్రభుత్వ వైన్ షాపులు మూత.. నేటి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభం

AP liquor policy 2024 Ap new liquor policy 2024 price list New liquor policy in ap rates Ap new liquor policy 2024 price list pdf AP New Liquor rates
Peoples Motivation

AP Liquor Policy: ప్రభుత్వ వైన్ షాపులు మూత.. నేటి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభం

నేటి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు..

రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు..

లైసెన్స్‌ రెండేళ్ల పాటు అమలులో..

AP liquor policy 2024 Ap new liquor policy 2024 price list New liquor policy in ap rates Ap new liquor policy 2024 price list pdf AP New Liquor rates

నూతన మద్యం దుకాణాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిన్నటితో పాత దుకాణాల గడువు ముగిసింది. ప్రభుత్వ దుకాణాల్లో మిగిలిన మద్యాన్ని డిపోలకు తరలించారు. లాటరీలో లైసెన్స్‌ దక్కించుకున్న యజమానులు కొత్త దుకాణాల్లో మద్యం అమ్మేందుకు అంతా సిద్ధం చేశారు. కొన్నిచోట్ల లైసెన్స్‌దారులు షాపుల కోసం ప్రాంగణాలను వెతుకులాడే పనిలో ఉన్నారు.

వైన్ షాప్ లకు నిబంధనలు..

ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సిఉంది. నిబంధనల మేరకు చాలాచోట్ల షాపులు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉండడంతో వెనుకంజ వేస్తున్నారు. సిండికేట్‌తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు తమ లైసెన్సులను ఇతరులకు ఇచ్చేందుకు బేరసారాలు జరుపుతున్నారు. చాలా షాపులు చేతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెండేళ్ల పాటు లైసెన్స్‌..

నూతన మద్యం పాలసీ ప్రకారం షాపులు దక్కించుకున్న వారు నిబంధనల ప్రకారం వార్షిక లైసెన్సు రుసుములో... ఆరో వంతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. దుకాణదారులు ఈ మొత్తాన్ని చెల్లించడంతో తాత్కాలిక లైసెన్స్‌ జారీ చేశారు. ఇది ఈనెల 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. షాపులను అద్దెకు తీసుకున్న తర్వాత రెండేళ్ల పాటు అమలులో ఉండే పూర్తి స్థాయి లైసెన్స్‌ ఇస్తారు. ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.

ప్రభుత్వ మద్యం షాపులు రద్దు..

నూతన మద్యం విధానంలో భాగంగా ఇప్పటి వరకు నడుస్తున్న ప్రభుత్వ షాపులు మూతపడ్డాయి. వీటిలోని సరకును వ్యాపార సమయం ముగిసిన తర్వాత మద్యం డిపోల అధికారులు, సిబ్బంది లెక్కించారు. సరకును బుధవారం ఉదయం నుంచి సాయంత్రంలోగా సంబంధిత డిపోలకు చేరుస్తారు. వాకిన్‌స్టోర్లలోని సరకును తరలిస్తారు. ప్రైవేటు షాపులు తెరిచినా, తెరవకపోయినా ప్రభుత్వ దుకాణాలను అన్ని చోట్లా మూసివేశారు.

Comments

-Advertisement-