రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Bharatmala Pariyojana: ఏపీ కి గుడ్ న్యూస్.. ఈ జాతీయ రహదారులకు కేంద్రం ఆమోదం

Bharatmala pariyojana map Bharatmala Pariyojana launch Date Bharatmala Pariyojana UPSC Bharatmala Pariyojana Phase 2 Bharat Mala project list Bharatma
Peoples Motivation

Bharatmala Pariyojana: ఏపీ కి గుడ్ న్యూస్.. ఈ జాతీయ రహదారులకు కేంద్రం ఆమోదం

భారతమాల పరియోజన మొదటి దశ కింద ఏడు జాతీయ రహదారులకు ఆమోదం...

మొత్తం 384 కిలో మీటర్ల పొడవు..

ఏడు జాతీయ రహదారులకు ఆరు వేల 280 కోట్ల రూపాయల వ్యయం..

కేంద్ర రహదారులు, రవాణాశాఖ ఆమోదం..

Bharatmala pariyojana map Bharatmala Pariyojana launch Date Bharatmala Pariyojana UPSC Bharatmala Pariyojana Phase 2 Bharat Mala project list Bharatmala pariyojana status Bharatmala Phase 2 projects list

భారతమాల పరియోజన (Bharatmala Pariyojana) మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్ కి మంజూరైన ఏడు జాతీయ రహదారుల నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి కేంద్ర రహదారులు, రవాణాశాఖ పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులు గత సంవత్సరమే మంజూరైనప్పటికీ వాటి టెండర్ల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసింది. తాజాగా ఏకకాలంలో అన్నింటినీ ప్రారంభించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. మొత్తం 384 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణానికి తొలుత 6 వేల 646 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుతం ఆ వ్యయాన్ని 6 వేల 280 కోట్ల రూపాయలకు తగ్గించింది. ఈ ప్రాజెక్టుల్లో కొండమోడు-పేరేచెర్ల సెక్షన్‌ విస్తరణ సైతం ఉంది.

ఈ ఏడు ప్రాజెక్టుల్లో తొలి రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే టెండర్లు పిలవగా ఇద్దరు ఎల్‌-1గా నిలిచారు. దాంతో ఆ రెండు కంపెనీలు కోట్‌ చేసిన మొత్తానికే తాజా ధరలను నిర్ణయించి అంచనాలను సవరించారు. కొండమోడు-పేరేచెర్ల రహదారి విస్తరణలో భాగంగా దానికి అనుబంధంగా సత్తెనపల్లి, మేడికొండూరుల వద్ద రెండు బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు ఒక ప్రకటనలో తెలిపారు.


భారతమాల పరియోజన మొదటి దశ కింద ఆమోదం పొందిన ఏడు ఏపీ జాతీయ రహదారుల వివరాలు

• జాతీయ రహదారి నెంబర్ 167AG లో 49.917 కిలో మీటర్ల మార్గాన్ని 881.61 కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

• NH 167Kలో సంగమేశ్వరం-నల్లకాలువ, వెలిగొండ-నంద్యాల మధ్య 62.571 కిలోమీటర్ల మార్గాన్ని 601 కోట్ల రూపాయల వ్యయంతో రెండు వరుసలుగా విస్తరిస్తారు.

• కొత్తగా జాతీయ రహదారిగా ప్రకటించిన ఎన్‌హెచ్‌ 167K లో నంద్యాల-కర్నూలు/కడప బోర్డర్‌ సెక్షన్‌ను 62 కిలో మీటర్ల మేర ఆధునికీకరించనున్నారు. ఇందుకోసం 691 కోట్ల రూపాయలను వెచ్చిస్తారు.

• NH-440లో వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు (ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా) ఉన్న 78.95 కిలోమీటర్ల రహదారిని 1,321 కోట్ల రూపాయలతో రెండు, నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

• NH 716G లోని ముద్దనూరు-హిందూపురం సెక్షన్‌లో 33.58 కిలోమీటర్ల మార్గాన్ని 808 కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

• NH 716Gలో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి సెక్షన్‌ వరకు 56.5 కిలోమీటర్ల మార్గాన్ని 1,019.97 కోట్ల రూపాయలతో నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

• NH 516Bలో పెందుర్తి నుంచి ఎస్‌.కోట మార్గంలో ఉన్న 40.5 కిలోమీటర్ల రోడ్డును 956.21 కోట్ల రూపాయలతో 2, 4 వరుసలుగా విస్తరిస్తారు.

Comments

-Advertisement-