అక్షరాస్యత తోనే మానవ వనరుల అభివృద్ధి
అక్షరాస్యత తోనే మానవ వనరుల అభివృద్ధి
'ఉల్లాస్' కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు
స్వచ్ఛంద ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది ద్వారా బోధన
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, అక్టోబర్ 17 (పీపుల్స్ మోటివేషన్):-
అక్షరాస్యత తోనే మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని, "ఉల్లాస్" కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉల్లాస్ కార్యక్రమం అమలు పై జిల్లా స్థాయి కన్వర్జెన్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు..ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రతి గ్రామం లో 50 ఏళ్ల లోపు ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదవడం, రాయడం నేర్పించాలన్నారు..స్వయం సహాయక సంఘాల్లో ఉన్న వారిని చింత ఉపాధ్యాయులు గా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు..వీరితో పాటు సచివాలయ ఉద్యోగులను కూడా ఇందులో భాగస్వాములు చేయాలన్నారు..ప్రతి సచివాలయ ఉద్యోగి సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఐదు నుండి పదిమంది నిరక్షరాస్యులను ఎంపిక చేసుకుని చదువు చెప్పేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జడ్పీ సీఈఓ ను ఆదేశించారు..వారికి వీలున్నప్పుడు తరగతులు బోధించేలా చూడాలని కలెక్టర్ సూచించారు.. తరగతులకు సంబంధించిన మెటీరియల్, వీడియోలను వాట్సప్ ద్వారా సచివాలయం సిబ్బందికి పంపించేలా చర్యలు తీసుకోవాలని వయోజన విద్యా శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు..
పొదుపు సంఘాల మహిళలు, సచివాలయం సిబ్బంది సర్వే చేసి గ్రామంలో నిరక్షరాస్యుల జాబితాను తయారు చేసుకోవాలన్నారు. పొదుపు సంఘాల్లో వాలంటీర్ టీచర్లను గుర్తించాలని కలెక్టర్ డిఆర్డిఎ ఎపిడి ని ఆదేశించారు. ముందుకు వచ్చిన వాలంటరీ టీచర్లక, సచివాలయ సిబ్బందికి పురస్కారాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. తరగతుల నిర్వహణకు అంగన్వాడీ కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు.. అక్షరాస్యతా తరగతులు సక్రమంగా నిర్వహించేలా పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డీలు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాలన్నారు.. ఎంఈఓ లు,హెడ్మాస్టర్లు, టీచర్లు సమర్థవంతంగా తరగతులు నిర్వహించేందుకు తగిన శిక్షణ, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. చదువు నేర్చుకున్న వారికి ఆరు నెలలకు ఒకసారి ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్ అందజేయబడుతుందని కలెక్టర్ తెలిపారు..6 నెలలకు ఈ అంశం పై అన్ని మండలాల ఎంపిడిఓ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, వయోజన విద్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డిఈఓ శామ్యూల్, డిపిఓ భాస్కర్, సమాచార శాఖ ఉప సంచాలకులు జయమ్మ,ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ, డిఆర్డిఎ ఎపిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..