భయం గుప్పెట్లో సముద్ర తీర ప్రాంత ప్రజలు
భయం గుప్పెట్లో సముద్ర తీర ప్రాంత ప్రజలు
ఇల్లులు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్తున్న మత్స్యకారులు
సముద్రం ముందుకు రాకుండా త్వరగా అడ్డుకట్టు వేయాలి
ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలి : మాజీ వైస్ ఎంపీపీ సూరాడ రాజు
యు కొత్తపల్లి మండలం అక్టోబర్ 17 పీపుల్స్ మోటివేషన్
తుఫాన్ వచ్చినప్పుడల్లా మత్స్యకారులకు నరకయాతన అనుభవిస్తున్నామని ఏ క్షణంలో ఏ విధంగా ఉంటుందో తెలియడం లేదని వాయుగుండం కారణంగా ఉప్పాడ సముద్ర తీరం భారీ కెరటాలతో సముద్రపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో మత్స్యకారులు భయపడుతున్నారు. ఉప్పాడ ఆల్లక వారి వీధి .సూరడ పేట .మాయపట్నం చిన్న బజారు వీధి తీర ప్రాంతానికి చెందిన ఇల్లజలమయమయ్యాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని మత్స్యకార నాయకులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై తెలుగుదేశం నాయకులు మరియు అప్పటి మాజీ వైస్ ఎంపీపీ సూరాడ రాజు మాట్లాడుతూ తుఫాను వచ్చినప్పుడల్లా జీవన ఉపాధి కోల్పోయి ఎన్నో గృహాలు నేలమట్టం అవుతున్నాయని. గత 15 సంవత్సరాలుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం లో నివశిస్తున్న అనెక కుటుంబాల ఇల్లు జలమయం అయ్యాయినీ.నా చిన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు సముద్రం ఐదు ఎకరాలు ముందుకు వచ్చిందని దీనితో కొన్ని వేల గృహాలు జలమయం అయ్యాయని రాజు తెలిపారు. అంతేకాకుండా ఉప్పాడ అనేది గొప్ప చరిత్ర అని రెండు ట్రావెల్స్ బంగ్లాలు 5 దేవాలయ గోపురాలు సముద్రంలో మునిగిపోయాయని రాజు తెలిపారు. కొంతమంది మత్స్యకారులు ఈ గ్రామాన్ని వదిలి వేరే గ్రామాలకు వలస వెళ్లిపోయారని ఇదే కొనసాగితే ఉప్పాడ సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ సముద్రం ముందుకు రాకుండా చర్యలు చేపట్టాలని సూరాడ రాజు తెలిపారు.
ఆయన వెంట తెలుగుదేశం నాయకులు మత్స్యకారులు సూరడ అప్పారావు. సూరడ జగన్నాధం.లచ్చన్న తదితరులు ఉన్నారు.