పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థిని మృతి.. నిందితుడి అరెస్ట్
పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థిని మృతి.. నిందితుడి అరెస్ట్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే..
- నిన్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది విఘ్నేశ్..
- సీఎం ఆదేశాలతో పోలీసుల ముమ్మర గాలింపు..
- నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా అదుపులోకి..
- నిందితుడు విఘ్నేశ్‌ను అదుపులోకి తీసుకున్న బద్వేల్ పోలీసులు..
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతిచెందింది కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించింది. శనివారం నాడు విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలిచంగా చికిత్స పొందతూ ఇవాళ ఉదయం చనిపోయింది. సీఎం ఆదేశాలతో ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుణ్ని వెంటనే అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేసి వారు తీవ్రంగా గాలిస్తుండగా రాత్రి వేళ ఓ బృందానికి నిందితుడిని కనిపించడంతో విఘ్నేశ్‌ను బద్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కలవడానికి రమ్మని చెప్పి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్నేహితుడి ముసుగులో విఘ్నేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపిన మేరకు బాధిత బాలిక (16) ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేష్‌తో చిన్నప్పటి నుంచీ స్నేహం ఉంది. అతడికి వివాహం కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి శనివారం తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేష్ మధ్యలో ఆ ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పీపీకుంట చెక్‌పోస్టు వద్ద దిగి సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. కొంతసేపటికి విఘ్నేష్ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు.
కొందరు మహిళలు ఆమెను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అమ్మాయిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే నిందితుడు తనను పథకం ప్రకారం ముళ్ల పొదలోకి తీసుకెళ్లి నిప్పు అంటించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా జడ్జి ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.