రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం....అందుకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదాన్ని ఆవిష్కరించేలా కొత్త పాలసీలు

ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్

-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష..వచ్చే క్యాబినెట్ ముందుకు కొత్త పాలసీలు

అమరావతి, అక్టోబర్ 14 (పీపుల్స్ మోటివేషన్):-

ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు ఉండాలని ఆయన అభిప్రాయ పడ్డారు. పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడుదారులను ఆకర్షించి.... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు ఉండాలని చంద్రబాబు అన్నారు. 

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై మరికొంత కసరత్తు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మిగిలిన మూడు పాలసీలను వచ్చే క్యాబినెట్ ముందుకు తీసుకువచ్చేందుకు ఈ సందర్భంగా నిర్ణయించారు. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుందని సిఎం అన్నారు. దాదాపు 7-8 శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం....వీటి రూపకల్పనపై మూడు నెలలుగా కొత్త కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఉత్తమ ఫలితాలు ఇచ్చిన ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా అధికారులు పాలసీలు రూపొందించి ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వీటిపై సిఎం లోతుగా చర్చించి సమీక్ష నిర్వహించారు. ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్నారు. ఈ సమీక్షలో అధికారులు ఆయా పాలసీలపై ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రతిపాదించనట్లు తెలిపారు. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ మెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ విధానాలను రూపొందించారు. 


ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ....దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా కంపెనీలకు జాప్యం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఇన్సెన్టివ్ లు దక్కుతాయని...ఇది పారిశ్రామిక ప్రగతికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని సిఎం అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఇలాంటి కీలక నిర్ణయాలు దోహదం చేస్తాయని....ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను, విధివిధానాలను సమగ్రంగా స్టడీ చేసి.....నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక కుటుంబం...ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్ తో ఎంఎస్ ఎంఈ పాలసీ ఉండాలని..అది కూటమి ప్రభుత్వ విధానమని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అదే విధంగా గత క్యాబినెట్ లో ప్రకటించినట్లు అమరావతిలో దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా పేరున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. పారిశ్రామిక రంగ అభివృద్దికి దోహదపడేలా ప్రత్యేక రతన్ టాటా హబ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్కిల్స్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సిఎం అన్నారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్ కు అనుంబంధంగా సెంటర్స్ ఏర్పాటు జరుగుతుందని....ఒక్కో సెంటర్ కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్ గా ఉండేలా డిజైన్ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఆక్వా, ఫౌల్ట్రీ రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ లో ఫలితాలు వచ్చే విధానాలను అమలు చేయాలని ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. ఫౌల్ట్రీ రంగంతో పాటు పాడి పరిశ్రమ, మేకలు, గొర్రెలు పెంపకానికి ప్రాధాన్యతను ఇవ్వాలని...తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ పాలసీల్లో ఈ అంశాలను చేర్చాలని సిఎస్ సూచించారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్ ఇచ్చేలా ప్రతిపాదించాలని సిఎం సూచించారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీపైనా అధికారులతో చర్చించారు. అయితే మరింత కసరత్తు తరువాత క్యాబినెట్ ముందుకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీని తీసుకురావాలని సిఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-