చైనాలో భారీ సంక్షోభం... పాఠశాలలు మూసివేత
General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
By
Peoples Motivation
చైనాలో భారీ సంక్షోభం... పాఠశాలలు మూసివేత
చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2023లో దేశవ్యాప్తంగా 14,808 కిండర్ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11% తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 2023 ఏడాదిలో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. గతేడాది జననాల సంఖ్య దాదాపు 20లక్షలు తగ్గినట్లు అంచనా. 2023లో దేశవ్యాప్తంగా 90లక్షల జననాలు నమోదయ్యాయి.. 1949 నుంచి ఇంత తక్కువగా నమోదవ్వడం అదే తొలిసారి.
జనాభా పరంగా చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జననాల సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోగా.. మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. 2023 నాటికి 60ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా.. 2035 నాటికి ఈ సంఖ్య 40కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్‌గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.
Comments