-Advertisement-

దసరా సెలవులలో ఊళ్ళకు వెళుతున్నారా..? జాగ్రత్త..!

Sabarimala online booking date Sabarimala online ticket booking 2024 www.sabarimala online.org login Sabarimala Online registration Sabarimala online
Peoples Motivation

దసరా సెలవులలో ఊళ్ళకు వెళుతున్నారా..? జాగ్రత్త..!

Sabarimala online booking date Sabarimala online ticket booking 2024 www.sabarimala online.org login Sabarimala Online registration Sabarimala online room booking

దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అనంతపురం సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS ఆదేశాల మేరకు దొంగతనాలు జరుగకుండా ప్రత్యేక నిఘా వేశామన్నారు. దీంతో పాటు ప్రజలు సహకరించి సి.సి.ఎస్ పోలీసులు సూచించిన  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు బంగారం దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. 

• డబ్బు మరియు విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్ళకూడదు.

 • రాత్రివేళ అనుమానంగా సంచరించేవారి గురించి పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి

• తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలి

• విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిది.

• వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు.

• పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

• ఇంట్లో కుటుంబసభ్యులు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దు.

• ఖరీదైన వస్తువులను బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలి.

• CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

• కొత్తవారి కదలికలపై, అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలి.

• చుట్టు పక్కల వారి సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.

• బయటికేల్లేటప్పుడు తాళలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.

• గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.

• లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకుని తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు చెక్ పెట్టండి

• సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా వుండాలి

• అలాగే దసరా పండుగ సందర్భంగా పెద్ద పెద్ద కంపెనీలు మంచి మంచి ఆఫర్లు ఇచ్చినందున ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు డూప్లికేట్ ఐడి క్రియేట్ చేసి ప్రజలను మోసం చేసే అవకాశం ఉన్నందున, ఆన్లైన్ షాపింగ్ చేసేవారు మోసపోయి విలువైన డబ్బులు పోగొట్టుకోవద్దు.

• అవసరం లేకుండా వచ్చే మెసేజ్ లల్లో బ్లూ కలర్ లింకులను ఓపెన్ చేయవద్దు.

• లాటరీ తగిలిందని, ఏదో గిఫ్ట్ వచ్చిందని, కారు వచ్చిందని, బైక్ వచ్చిందని, డబ్బులు వచ్చాయని, విలువైన వస్తువులు తక్కువ ధరకు ఇస్తామని, వచ్చే లింకులను... వచ్చే మెసేజ్లను నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు. గిఫ్ట్ లు తీసుకొచ్చామంటూ ఇళ్లలోకి వచ్చి వృద్ధ మహిళలు ధరించిన ఆభరణాలు లాక్కెళ్లే ప్రమాదముందన్నారు.  సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా వుండాలన్నారు. సైబర్ నేరానికి గురైన వారు వెంటనే 1930 కి కాల్ చేయాలని సి.ఐ విజ్ఞప్తి చేశారు.

Comments

-Advertisement-