నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఊరు చివరన ఏర్పాటు చేయండి
నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఊరు చివరన ఏర్పాటు చేయండి
ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలకు దగ్గరలో మద్యం దుకాణం వద్దే వద్దు..
పత్తికొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) కి విద్యార్థి యువజన సంఘాల వినతి పత్రం
ఈ నెల 16వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సిఉంది. దేవనకొండ మండలంలో విద్యార్థులకు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్న, మండల కేంద్రమైన దేవనకొండ నందు నూతనంగా ప్రారంభించిన మద్యం షాపును ఊరి చివరన ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కె. భాస్కర్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు బి. రవి లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏఐఎస్ఎఫ్ - ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దేవనకొండ నందు నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వలన విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వినతిపత్రం రూపంలో పత్తికొండ ఎక్సైజ్ సీఐ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రము దేవనకొండ నందు కర్నూలు - పత్తికొండ రహదారిలో "నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం" దగ్గరలోనే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం మరియు ఎఫ్ ఆర్ హై స్కూల్ నిర్వహిస్తున్నారని తెలిపారు. తద్వారా మద్యం షాపు ఏర్పాటు చేయడం వలన విద్యార్థులు,టీచర్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో మద్యం దుకాణం ఏర్పాటు వలన ట్రాఫిక్ అంతరాయం ఎక్కువగా ఉండడం మరియు మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసిన వారు ఆ పరిసర ప్రాంతాల్లోనే కూర్చొని మద్యం సేవించడం వలన వారు ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వాహనదారులకు, పాదచారులకు, విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం, విచారకరం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కూత వేటు దూరంలో ఏర్పాటు చేసిన "నూతన మద్యం దుకాణాన్ని ఊరు చివరన సుదూర ప్రాంతంలో" ఏర్పాటు చేసి విద్యార్థులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘం నాయకులు మధు, సురేంద్ర, భరత్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.