పెండింగ్ లో ఉన్న ఓటర్ల జాబితా సవరణ వెంటనే పరిష్కరించండి
పెండింగ్ లో ఉన్న ఓటర్ల జాబితా సవరణ వెంటనే పరిష్కరించండి
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, అక్టోబర్ 19 (పీపుల్స్ మోటివేషన్):-ఓటర్ల జాబితా సవరణ (ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025)కు సంబంధించి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్, అబ్జెక్షన్ లను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లను ఆదేశించారు..
శనివారం స్పెషల్ సమ్మరీ రివిజన్ -2025 అంశం పై ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 29 వ తేదీన డ్రాఫ్ట్ రోల్ ప్రచురించాల్సి ఉందన్నారు..ఈ సమయం చాలా కీలకం అని, ఈ లోపు ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం చేయవలసిన ప్రక్రియలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ప్రతి ప్రక్రియను జాగ్రత్తగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఓటర్ల జాబితా సవరణ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్, అబ్జెక్షన్ లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 625,ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 520, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 375 క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయని, అలాగే కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాలలో కూడా క్లెయిమ్స్ మరియు అబ్జెక్షన్స్ పెండింగ్ లో ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓ లను కలెక్టర్ ఆదేశించారు.
అలాగే డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ కి సంబంధించి 19 వేల వరకు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ ఏఈఆర్ఓ లను ప్రశ్నించారు.. 30 రోజుల్లోపు వీటిని పరిష్కరించాల్సి ఉందని, 30 రోజులు దాటినా పెండింగ్ లో ఉంచిన ఏఈఆర్వో లకు వెంటనే నోటీసు లు ఇచ్చి వివరణ కోరాలని సంబంధిత ఈఆర్వో లను కలెక్టర్ ఆదేశించారు.. ఈ అంశం పై ఈఆర్ఓ లు ఎప్పటికపుడు సమీక్షించుకుని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఎన్నికల కమిషన్ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, నిర్దేశించిన సమయం లోపు ప్రతి ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు..
టెలికాన్ఫరెన్స్లో పాణ్యం అసెంబ్లీ ఈఆర్ఓ, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్, ఆదోని అసెంబ్లీ ఈఆర్ఓ మౌర్య భరద్వాజ్, పత్తికొండ అసెంబ్లీ ఈఆర్ఓ భరత్ నాయక్, కోడుమూరు అసెంబ్లీ ఈఆర్ఓ సందీప్ కుమార్, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఈఆర్ఓ నాసర రెడ్డి , మంత్రాలయం అసెంబ్లీ ఈఆర్ఓ విశ్వనాథ్, ఆలూరు అసెంబ్లీ ఈఆర్ఓ రాము నాయక్, డిఆర్ఓ చిరంజీవి, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.