జీవితంలో మనిషి ఎలా ఉండాలో రామాయణం లో చూపిన ఆదికవి వాల్మీకి మహర్షి
జీవితంలో మనిషి ఎలా ఉండాలో రామాయణం లో చూపిన ఆదికవి వాల్మీకి మహర్షి
వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి , టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల, అక్టోబర్ 17 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహం దగ్గర వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి సంఘ సభ్యులు ఏర్పాటుచేసిన పలు కార్యక్రమంలో పాల్గొన్నారు . అలాగే దేవనగర్ లో ఉన్న వాల్మీకి మహర్షి టెంపుల్ ను సందర్శించి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు అనంతరం దేవనగర్ నందు అన్నదాన కార్యక్రమాన్ని ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహిస్తామని యువనేత నారా లోకేష్ గత పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ ఉత్సవంలా వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు వాల్మీకి రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి మహర్షి అన్నారు. ఒక భార్య ఎలా ఉండాలో సీతాదేవి రాముని చరిత్ర రామాయణంలో రచించిన అద్భుతమైన కవి అన్నారు అన్నదమ్ములు ఎలా ఉండాలో రామ్ లక్ష్మణులు మెలిగిన తీరును రామాయణంలో ప్రస్తావించారన్నారు .అదేవిధంగా నమ్మకస్తుడిగా ,విశ్వాస ప పాత్రుడిగా హనుమంతుడు రాముడు అనుబంధాన్ని రామాయణంలో చూపించారు. ఒక దుర్మార్గుడు రావణాసురుడు అప్పట్లో వ్యవహరించిన అనుబంధం పై ఎంతో చాకచక్యంగా రామాయణంలో మానవీయ కథనాలను ప్రపంచానికి అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి అని కొనియడారు. వాల్మీకి మహర్షికి ఎవరు సాటిలేరని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాభున్నిసా , మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి , టీడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర రావు , మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసి రెడ్డి , నంద్యాల టిడిపి కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్ లాల్ , నాగార్జున ,జైనాబి , శ్రీదేవి మరియు జాతీయ వాల్మీకి పోరాట సమితి ఉపాధ్యక్షులు బోయ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి బి గోవింద నాయుడు కార్యదర్శి పివి రమణ , సివి శివ (ఆర్.ఎం.పి) , వాల్మీకి నాయకులు చందు, సుందర్, పరమటూరు శేఖర్, మునగాల శీను, కాశన్న, గురప్ప, తిమ్మయ్య, వెంకటరాముడు, కానాల వెంకటేశ్వర్లు, లాలప్ప, బాల తిమ్మయ్య, అంజి, రాంబాబు , మాజీ కౌన్సిలర్లు దస్తగిరి , కృపాకర్ , దేవనగర్ వెంకటసుబ్బయ్య , వడ్డే జనార్ధన్ , విజయ గౌరీ , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , బద్రి శెట్టి రవికుమార్ , పృధ్విరాజ్ యాదవ్ , సుధాకర్ , కాజా , టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు , శ్రీను వాల్మీకి నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు