అల్లర్లు, గొడవలను ప్రేరేపితం చేసి అశాంతిని సృష్టిస్తే ఉపేక్షించేది లేదు-జిల్లా ఎస్పీ
శాంతి భద్రతలకు, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన త్రీవ చర్యలు తీసుకుంటాం: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్, ఐ.పీ.ఎస్.,
అల్లర్లు, గొడవలను ప్రేరేపితం చేసి అశాంతిని సృష్టిస్తే ఉపేక్షించేది లేదు-జిల్లా ఎస్పీ
కురిచేడు మండలం, దేకనకొండ గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహం ఊరేగింపు సమయంలో ఇరు వర్గాలకు చెందినవారు మారణాయుధాలతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడి హత్యాయత్నం చేసుకున్నారు. ఈ క్రమంలో కురిచేడు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపడం జరిగింది. బెయిల్ పై బయకు వచ్చిన వారికి గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుమారు 51 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా గొడవలకు పాల్పడి జిలాల్లోనే మీ ఊరుకి చెడ్డ పేరు తీసుకోని వచ్చారని తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
ఈ కౌన్సిలింగ్లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని, ఎవరైనా సరే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న అల్లర్లకు పాల్పడిన తీవ్ర చర్యలు ఉంటాయని, గ్రామ బహిష్కరణలు, పీడీ యాక్టులు, తదితర చట్టపరమైన చర్యలతో తమ ఇంటికి, పిల్లలకు, గ్రామాలకు జిల్లాకు దూరంగా జీవించవలసి వస్తుందని, వారిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు.కేసుల్లో పట్టుబడి పోలీసు రికార్డ్స్ లో పేరు నమోదయ్యి భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని, పాస్ పోర్ట్, వీసాల వంటివి రావని, నిరుద్యోగులు తదుపరి ఉద్యోగాలకు అనార్హులుగా అవుతారని, సమాజంలో గౌరవం కోల్పోతారని వారిని త్రీవంగా హెచ్చరించారు.
జిల్లాలో ప్రతి ఒక్కరూ ఘర్షణలకు పాల్పడరాదని, గొడవలు, కొట్లాటలు, పరస్పర దాడులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.అర్థం లేని ఆవేశాలకు లోనై నేరాలకు పాల్పడి తమ జీవితాలను అంధకారం చేసుకోవద్దని, జిల్లాలో ప్రతి ఒక్కరు పల్లెలు/పట్టణాలలో ఎటువంటి దాడులకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.
ఈ కౌన్సిలింగ్ లో దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, త్రిపురాంతకం సీఐ జి.అస్సన్, కురిచేడు ఎస్సై శివ మరియు సిబ్బంది ఉన్నారు.