-Advertisement-

ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపకపోతే చర్యలు తప్పవు

Peoples Motivation

ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపకపోతే చర్యలు తప్పవు

ఆర్డీవోలు, స్పెషల్ ఆఫీసర్లు,ఎంపిడిఓ లు రోజువారీ హౌసింగ్ పురోగతిపై సమీక్షలు నిర్వహించాలి

100 రోజుల్లో నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలు కచ్చితంగా సాధించాలి

ఉపాధిహామీ పని దినాల కల్పనలో ప్రత్యేక దృష్టి పెట్టాలి

పల్లె పండుగ లో శంకుస్థాపన చేసిన పనులను జనవరి 15వ తేది నాటికి పూర్తి చేయాలి

పి జి ఆర్ ఎస్ కి సంబంధించి ఏ ఒక దరఖాస్తు రీ ఓపెన్, బియాండ్ ఎస్ఎల్ఏ కి వెళ్ళకూడదు

-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

కర్నూలు, అక్టోబర్ 18 (పీపుల్స్ మోటివేషన్):-

ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి చూపకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం కలెక్టరేట్ నుండి హౌసింగ్, ఉపాధి హామీ, పిజిఆర్ఎస్ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాల పురోగతిలో వెనుకబడి ఉన్నామని, ప్రస్తుతం వర్షాలు వల్ల తక్కువ పురోగతి ఉండవచ్చని, అయితే వచ్చేవారం నుంచి పురోగతి చూపకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. నిర్మాణాల పురోగతిపై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, హౌసింగ్ డీఈలు, ఏఈ లతో డివిజన్, మండలాల వారీగా కలెక్టర్ లోతుగా సమీక్షించారు.వంద రోజుల్లో నిర్దేశించుకున్న విధంగా ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు..

హౌసింగ్ విషయంలో ఫోకస్డ్ గా, కో ఆర్డినేషన్ తో వెళితే తప్ప పురోగతి సాధించలేరని కలెక్టర్ పేర్కొన్నారు. 100 రోజుల్లో హౌసింగ్ కి సంబంధించిన లక్ష్యసాధనకు డివిజన్ ల వారీగా కార్యాచరణ ప్రణాళిక ఏంటి అని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలను అడిగి తెలుసుకున్నారు..ఇళ్ళ నిర్మాణాల లక్ష్యంలో ఎక్కువ శాతం ఆదోనిలో ఎక్కువ ఉందని, ప్రత్యేక దృష్టి సారించి ఇళ్ళ నిర్మాణాలను విజయాలని కలెక్టర్ సూచించారు. ఆప్షన్ త్రీ కింద ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరితగతిన ఇళ్ళను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇసుక, సిమెంట్ సమస్యలు ఏమైనా ఉంటే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని పరిష్కరించుకోవాలన్నారు 

రూఫ్ కాస్ట్ లెవెల్ లో ఉన్న ఇళ్లను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..

100 రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాల సాధనలో భాగంగా గూడూరు మండలానికి 14 ఇళ్ళ నిర్మాణం లక్ష్యం కాగా నెలలో కేవలం ఒక్క ఇంటిని మాత్రమే పూర్తి చేశారని కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. 8 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కలిసి ఒక్క ఇల్లు పూర్తి చేయడమేంటి అని ప్రశ్నించారు..అలాగే హాలహర్వి మండలంలో కూడా 116 ఇళ్ళ నిర్మాణం లక్ష్యం కాగా నెలలో కేవలం 1 ఇంటిని మాత్రమే పూర్తి చేశారన్నారు..ఈ మండలాలకు సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు..వచ్చే వారంలో పురోగతి చూపకపోతే సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ లపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.. అదే విధంగా చిప్పగిరి, గూడూరు(అర్బన్), కర్నూలు, ఆదోని అర్బన్, మద్దికెర, నందవరం, వెల్దుర్తి, పత్తికొండ, ఎమ్మిగనూరు అర్బన్, మంత్రాలయం, ఆలూరు, కృష్ణగిరి, తుగ్గలి, పెద్దకడుబూరు, హోళగుంద, కోడుమూరు, కర్నూలు అర్బన్, అస్పరి, దేవనకొండ, కౌతాళం, కోసిగి, గోనెగoడ్ల, ఎమ్మిగనూరు, సి.బెలగల్, ఓర్వకల్లు మండలాల్లో కూడా పురోగతి లేదన్నారు.. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని, సచివాలయాల వారీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు నీర్లకు వారపు లక్ష్యాలను కేటాయించి, వారితో ప్రతి రోజు మాట్లాడి పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ ఎంపీడీవోలను ఆదేశించారు.

గత 3 వారాల నుండి జీరో పురోగతి ఉన్న 25 సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు కూడా షోకాజ్ నోటీసు లు జారీ చేయాలని సంబంధిత మండలాల ఎంపిడిఓ లను కలెక్టర్ ఆదేశించారు .. ఇళ్ళ నిర్మాణంలో 90 రోజుల పని దినాలు కల్పించడంలో భాగంగా ఆదోని, ఓర్వకల్లు, పత్తికొండ, కొసిగి, కౌతాళం, ఎమ్మిగనూరు మండలాల్లో పని దినాలు కల్పించేందుకు వీలు ఉన్న ఎందుకు కల్పించలేకపోతున్నారని, ఇక్కడ పని దినాలు కల్పిస్తే ఉపాధి హామీలో నిర్దేశించిన లక్ష్యాలను కూడా సాధించేందుకు వీలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.. 90 రోజుల పని దినాలు కల్పించడంలో సరైన పురోగతి లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఐహెచ్హెచ్ఎల్ కి సంబంధించి కోడుమూరు, సి.బెలగల్, మంత్రాలయం, హోళగుంద, కోసిగి, మండలం పురోగతి తక్కువగా ఉందని, ప్రత్యేక దృష్టి పెట్టి పురోగతి సాధించాలని కలెక్టర్ ఆదేశించారు.

 ఆప్షన్ 1, 2 కింద స్వయం సహాయక సంఘాల్లో ఉన్న లబ్దిదారులకు బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించుకుని లోన్ లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డిఏ పిడి ని కలెక్టర్ ఆదేశించారు.. 


.ఉపాధి హామీ పనులకు సంబంధించి జూలై మాసానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించినప్పటికీ, మరల అదనపు లక్ష్యాలు కేటాయించడంతో పని దినాలు కల్పించడంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా 26వ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. కర్నూలు జిల్లా పని దినాలు కల్పించడంలో 53.49 శాతం సాధిస్తే అందులో కృష్ణగిరి మండలం పని దినాలు కల్పించడంలో అత్యంత తక్కువ పురోగతి 34 శాతం సాధించారని, 14 వేల మంది జాబ్ కార్డు హోల్డర్ లు ఉన్నపటికీ కూడా 1000 మందికి మాత్రమే పని దినాలు కల్పించడం ఏంటని? ఎంపిడిఓ, ఎపిఓ లను కలెక్టర్ ప్రశ్నించారు.... ఫీల్డ్ అసిస్టెంట్ లేనందువల్ల చేయలేకపోయామని అధికారులు తెలుపగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఎందుకు నియమించుకోలేదని, ఈ వంకతో పనులు చేయకపోవడం నిర్లక్ష్యమేనని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ విషయం పై తనకు రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ డ్వామా పిడిని ఆదేశించారు..

ప్రతి పంచాయితీలో ఫీల్డ్ అసిస్టెంట్ లు ఉండాలి, ఫీల్డ్ అసిస్టెంట్ లు లేరని పనులు కల్పించడంలో పురోగతి లేదని సమాధానం ఇస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు..

వెల్దుర్తి, తుగ్గలి, కర్నూలు, పెద్దకడబూరు, ఆదోని, నందవరం , కోసిగి, కోడుమూరు, ఎమ్మిగనూరు మండలాల్లో పని దినాలు కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కల్పించలేకపోతున్నారని, పని దినాలు కల్పించడంలో పురోగతి తీసుకొని రావాలని సంబంధిత మండలాల ఎంపిడిఓ లను కలెక్టర్ ఆదేశించారు..

హార్టికల్చర్ ప్లాంటేషన్ లో 4,311 ఎకరాలలో లక్ష్యాలకు గాను 3 వేల 400 ఎకరాలు పూర్తి చేశారని , లక్ష్యాలను కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

పిజిఆర్ఎస్ కు సంబంధించి మన జిల్లాలో జూన్ 15వ తేది నుంచి ఇప్పటి వరకు మొత్తం 4658 అర్జీలు వచ్చాయని, అందులో 3549 వాటిని పరిష్కరించడం జరిగిందని వీటిలో 3427 సరైన సమయంలో పరిష్కరించారని అయితే 122 మాత్రం బియాండ్ ఎస్ఎల్ఎలో ఉన్నాయన్నారు. బియాండ్ ఎస్ఎల్ఎ లోవరకు ఎందుకు వెళుతున్నారు అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు.. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పరిష్కరించిన దరఖాస్తుల్లో 8% దరఖాస్తులు రీఓపెన్ చేయడం జరిగిందని, వీటిని పై స్థాయి అధికారులు వెరిఫై చేసి వారి ఎండార్స్మెంట్ ను కూడా అప్లోడ్ చేయాలన్నారు. రీ ఓపెన్ కు గాని, బియాండ్ ఎస్ఎల్ఎ కు కానీ వెళ్ళకుండా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.. ఇప్పటికీ 0.2 శాతం ఇంకా చూడని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వచ్చిన పిటిషన్స్ వెంటనే ఓపెన్ చేసి చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

పిజిఆర్ఎస్ కేవలం జిల్లా కలెక్టర్ కు వచ్చి ఇచ్చే సమస్యలే కాక రాష్ట్ర స్థాయి నుండి ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రజావేదిక కార్యక్రమాలు, ఉపముఖ్యమంత్రి కార్యాలయం తదితర తదితర మాధ్యమాలు ద్వారా రావడం జరుగుతుందని, అందువల్ల జిల్లా స్థాయి అధికారులు, ఎంపిడిఓలు అలసత్వం వహించకుండా ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలన్నారు. రెవెన్యూ కి సంబంధించి రెక్టీఫ్కేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, యాక్షన్ అగైన్స్ట్ ల్యాండ్ గ్రాబింగ్, ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజేషన్ అంశాల పై ఎక్కువ కేసులు వస్తున్నాయని ఫీల్డ్ కి వెళ్లి వాటిని చెక్ చేసి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.. రీసర్వే జరిగిన అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించదం జరుగుతోందని, వచ్చిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. 

పల్లె పండుగ కి సంబంధించి సీసీ రోడ్లు, బిటి రోడ్లు, గోకులంలు నిర్మాణాల పనులకు మంజూరు చేశామని, ఎంపీడీవోలు పంచాయతీరాజ్ ఏఈ లతో సమీక్ష నిర్వహించుకుని జనవరి లోపు పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవా లని కలెక్టర్ ఆదేశించారు. 

వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, జెడ్పి సీఈఓ నాసరరెడ్డి, హౌసింగ్ పీడీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-