Cancer: రక్త పరీక్ష ద్వారా 12 రకాల క్యాన్సర్ల గుర్తింపు
Cancer: రక్త పరీక్ష ద్వారా 12 రకాల క్యాన్సర్ల గుర్తింపు
రక్త పరీక్ష ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించటంలో చాలా కీలకం. బ్రిటన్‌లో12 రకాల సాధారణ క్యాన్సర్లను కూడా ముందుగా పసిగట్టే ‘గేమ్ ఛేంజింగ్' అనదగ్గ రక్త పరీక్ష అందుబాటులోకి రాబోతున్నది.
రక్త పరీక్ష ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించటంలో చాలా కీలకం. బ్రిటన్‌లో12 రకాల సాధారణ క్యాన్సర్లను కూడా ముందుగా పసిగట్టే ‘గేమ్ ఛేంజింగ్' అనదగ్గ రక్త పరీక్ష అందుబాటులోకి రాబోతున్నది. క్యాన్సర్ లక్షణాలు రోగిలో బయటపడక ముందే ఈ రక్త పరీక్ష వ్యాధిని బయటపెడుతుందని తెలిసింది. తద్వారా కొన్ని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు ప్రాణాపాయం తప్పుతుందని, స్కానింగ్‌లు, టెస్టుల కోసం కొన్ని నెలలపాటు రోగుల సమయం వృథా కాకుండా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
బ్రిటన్ ఆరోగ్య మంత్రి వెస్ స్టీరింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులతో దేశవ్యాప్తంగా ‘సార్వత్రిక’ రక్త పరీక్షలను ఈ ఐదేండ్లపాటు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ పథకం కోసం 2.5 మిలియన్ పౌండ్ల (సుమారుగా రూ.27.56 కోట్లు) నిధులను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. సార్వత్రిక రక్త పరీక్ష పథకం అమలులో స్టార్టప్ కంపెనీ ‘ఎక్స్‌జెనెరా’ ప్రభుత్వానికి సాయం చేయనున్నది. ఊపిరితిత్తులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్.. ఇలా 12 రకాల సాధారణ క్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్షకు సంబంధించి ఒక రోగికి 120 పౌండ్లు (రూ.13 వేలు) ఖర్చు అవుతుందట.