Digital Arrest: డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? వీటితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.??
What do you mean by digital arrest,
Is digital arrest legal in India,
What is digital house arrest,
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, Cyber Security news
By
Peoples Motivation
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? వీటితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.??
డిజిటల్ అరెస్ట్.. ఇప్పుడీ భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాను మించి పెను భూతంలా వెన్నాడుతోంది. అనేకులు మోసపోతున్నారు. బెదరించి.. బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మోసం చేస్తున్నాడని గుర్తించి పోలీసులను అప్రమత్తం చేయాలి. ఓ రకంగా ఇలాంటి కాల్స్ వస్తే తిరస్కరించడమే మేలు. డిజిటల్ అరెస్టుల క్రమంలో భారత్ అప్రమత్తం అయ్యింది. బాధితులు హేతుబద్ధంగా ఆలోచించే వ్యవధి ఇవ్వరాదనే సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు, తక్షణం స్పందించకపోతే చట్టపరమైన చర్యలు వంటి మాటలతో భయపెట్టాలని చూస్తున్నారు. దేశీయంగా ప్రభుత్వ ఏజెన్సీలు అధికారిక లావాదేవీలకు వాట్సప్ లేదా స్కైప్ వంటి వేదికలను ఉపయోగించవు. ఎవరైనా ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించి.. మీ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నామని చెబితే బెంబేలు పడిపోకుండా అవతలి వ్యక్తులతో మాట్లాడి వారి గుర్తింపును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. మోసగాళ్లు మిమ్మల్ని మభ్యపెట్టి బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తారు. ఇటువంటి సందర్భాల్లో మన భయం వారి పని సులువు చేస్తున్నదనే విషయాన్ని గుర్తించాలి. చట్టబద్దమైన ఏజెన్సీలు ఏవీ తక్షణం డబ్బు పంపాలని ఒత్తిడి తీసుకురావు. సైబర్ నేరాలకు స్పందించే ముందు ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచించాలి. తెలియని నంబర్లకు ఫోను ద్వారా, వీడియోకాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం, ఆర్థికపరమైన వివరాలు ఇవ్వరాదు. పెరుగుతున్న సైబర్ నేరాల నుంచి రక్షించుకోవాలంటే మరింత జాగ్రత్తగా, ఎప్పటికప్పుడు ఇటువంటి పరిణామాలు తెలుసుకొంటూ ఉండటం అవసరం. ఒక్కోసారి చట్టబద్ధమైన సంస్థల లోగోలు కూడా మోసగాళ్లు వాడుతుంటారు. లాటరీ తగిలిందనే సందేశాలు వచ్చినపుడు గుడ్డిగా నమ్మడం, దురాశకు పోవడం చేస్తే సులువుగా దోచేస్తారు. వైద్య చికిత్సల కోసమని, ఫేక్ ఛారిటీ అప్పీళ్లతో భావోద్వేగాలను బలహీనతగా వాడుకునే కుంభకోణాలు, చట్టబద్ధమైన హైరింగ్ పోర్టల్స్ లేదా సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఉపాధి పోస్టులు పెట్టి నిరుద్యోగులను మోసగించే వైనాలు కూడా ఉంటున్నాయి. వినియోగదారులకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం ఆసరాగా చేసుకొని వైరస్ గురించి హెచ్చరించడం ద్వారా రహస్యంగా కంప్యూటర్లను యాక్సెస్ చేసి సున్నితమైన వ్యక్తిగత సమాచారం అపహరిస్తారు. త్వరగా డబ్బు సంపాదించాలనే బలహీనతను ఆసరాగా చేసుకొని పెట్టుబడి కుంభకోణాలు, ఫేక్ ఆన్లైన్ స్టోర్లతో క్యాష్ ఆన్ డెలివరీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. పొరపాటున మన ఖాతాకు పంపిన డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరడం.. ఓటీపీలు అడగటం.. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయనే బెదిరింపులు, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వజూపటం వంటి ఎత్తుగడల్లో సైబర్ నేరగాళ్లు నైపుణ్యం సాధించారు. దేశంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో డజనుకు పైగా సూచనలతో ప్రజలను అప్రమత్తం చేస్తూ సీఈఆర్డీ-ఐఎన్' కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా అత్యవసర పబ్లిక్ అడ్వయిజరీని జారీ చేసింది. భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం 'మన్ కీ బాత్'లో సైబర్ నేరాల గురించి ప్రజలను హెచ్చరించారు. అసలు 'డిజిటల్ అరెస్టు' అన్నదే పెద్ద ఆన్లైన్ కుంభకోణమని సీఈఆర్టీ - ఐఎన్ తెలిపింది. నిజానికి వారు ప్రదర్శించే ఒత్తిడి వ్యూహాలకు లొంగరాదని సీఈఆర్డీ- ఐఎన్ తన అడ్బయిజరీలో ప్రజలను కోరింది. 'డిజిటల్ అరెస్టు'ల పేరిట ఆన్లైన్లో జరుగుతున్న మోసాలను ప్రధాని మోదీ ఏకంగా మన్ కీ బాత్ లో ప్రస్తావించి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ఇటీవల వీటికి సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలో చోటుచేసుకొంటున్న డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, రొమాన్స్ స్కామ్లు, ఇన్వెస్ట్మెంట్ మోసాల్లో దాదాపు 46శాతం మూడు దేశాల నుంచే జరుగుతున్నట్లు గుర్తించారు. వాటిల్లో పొరుగున్న మయన్మార్, లావోస్, కంబోడియా కేంద్రంగా ఈ ముఠాలు రెచ్చిపోతున్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా బాధితులు దాదాపు రూ.1,776 కోట్లు నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి మోసపూరిత కాల్స్.. బెదిరింపులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలి. ప్రజలు ఒక్క క్షణం ఆలోచించి అడుగువేస్తే డిజిటల్ అరెస్టుల మోసం నుంచి రక్షణ పొందవచ్చు. నిజానికి డిజిటల్ మోసాలపై ఆందోళన చెందవద్దు. అప్రమత్తతతో ఉంటే చాలని గుర్తించాలి. నిజానికి మోసగాళ్లు ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి, ఆ తర్వాత భయపెడతారు. మనకే ఆశ్చర్యం కలిగించేలా మీ సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత తమ ఆహార్యంతో ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నామనే భ్రమ కల్పిస్తారు.వారెంతగా మిమ్మల్ని భయపెడతారంటే.. మనకుకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వరు. ఇప్పటికిప్పుడు తాము చెప్పినట్లు చేయకపోతే అరెస్టు తప్పదని మానసిక ఒత్తిడి తెస్తారు. దీంతో కొందరు భయంతో కష్టార్జితం మొత్తాన్ని వారికి కట్టబెడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే బెదిరిపోవద్దు. వీలైతే స్క్రీన్ షాట్ తీసి, కాల్ ను రికార్డు చేయాలి. డిజిటల్ అరెస్టు అనేది మన చట్టాల్లో లేదు. అది ముమ్మాటికీ మోసం, వంచన, అబద్ధం. ఇలాంటి పనులు చేస్తున్నవారు సమాజానికి శత్రువులు అనే గుర్తించాలి. కాల్ చేసిన వారి గురించి అస్సులు పట్టించుకోవద్దు. ఎలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు లొంగవద్ద, సాధ్యమైనంత వరకు కాల్స్ కట్ చేయాలి. బెదరింపులకు పాల్పడే వారిని గుర్తించి ఫిర్యాదు చేయాలి. అంతేగాకుండా మన తోటివారితో చర్చించాలి.
Comments