-Advertisement-

Group 1: అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన పోలీసుల లాఠీఛార్జ్‌

TSPSC Group 2 Notification TSPSC Group 3 TSPSC Group 2 Syllabus TSPSC Group 1 TSPSC Group 2 Notification 2024 TSPSC Group 2 exam Date TSPSC Group 2
Peoples Motivation

Group 1: అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన పోలీసుల లాఠీఛార్జ్‌

ప్రిలిమ్స్ పరీక్షల్లో జరిగిన తప్పులు సవరించాలి..

ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని ఆందోళన..

ఆ జీవో వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది..

జీవో 55నే అమలు చేయాలి..

TSPSC Group 2 Notification TSPSC Group 3 TSPSC Group 2 Syllabus TSPSC Group 1 TSPSC Group 2 Notification 2024 TSPSC Group 2 exam Date TSPSC Group 2 Notification PDF TSPSC Group 2 exam Date 2024

Group 1: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రీషెడ్యూల్‌ చేయాలని కోరుతూ హైదరాబాద్లోని అశోక్‌నగర్‌లో అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన కొంత మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో పలువురికి గాయాలయ్యాయి. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో అశోక్‌నగర్‌లో పోలీసుల పహారా కొనసాగుతోంది.

జీవో నెంబర్ 29ను రద్దు చేయాలి: 

కాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని, గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పుల విషయంపై తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు దీనిపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు సైతం దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇటీవల అభ్యర్థుల పిటిషన్లను కొట్టేసింది. అదేవిధంగా హైకోర్టు డివిజన్ బెంచ్లో పిటిషన్ వేయగా, సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో ఈనెల 21న గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. గురువారం హైదరాబాద్ గాంధీనగర్లోని పార్కుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు పరీక్షను రద్దు చేయాలని కోరారు. 

కేసులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్ నిర్వహించాలి:

గ్రూప్-1 పై ఉన్న కేసులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్ నిర్వహించాలని, లేకుంటే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. బుధవారం రాత్రి సైతం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రూప్-1 అభ్యర్ధులు ఒక్కసారిగా అశోక్ నగర్లోని రహదారి పైకి వచ్చారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఏంటి ఈ జీవో 29: 

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8వ తేదీన జీవో 29ను జారీ చేశారు. జనరల్‌ కేటగిరీలోని క్యాండిడేట్స్ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు పిలవాలని కోరుతున్నారు.

జీవో 55నే అమలు చేయాలి: 

తాజాగా జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 55నే అమలు చేయాలని కోరినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారణకు సుప్రీంకోర్టు, సోమవారానికి వాయిదా వేసింది.

Comments

-Advertisement-