Health tips: అన్నం గంజితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
Health tips: అన్నం గంజితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!
పూర్వం రోజుల్లో అన్నం వండి వార్చగా వచ్చిన గంజిని కొద్దిగా ఉప్పు కలిపి తాగేవారు. అందుకే వారంతా బలంగా ఉండేవారు అంటున్నారు నిపుణులు. అన్నం గంజితో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా సులభంగా మన ఇంట్లో దొరికే గంజీని అసలు వదలరు..
>> గంజిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీంతో తక్షణమే శక్తి లభిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత తీసుకుంటే ఇంకా మంచిది.
>> డయేరియా, అజీర్ణంతో బాధ పడుతున్న వారికి ఇది మంచి ఆహారం. తేలికగా జీర్ణం అవ్వడంతో పాటు గట్ హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
>> అనేక పోషకాలు కలిగి ఉండే గంజిని రోజూ తాగడం వల్ల శరీరంలో తేమ పెరుగుతుంది. తద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించొచ్చు.
>> బి1, బి2, బి6 వంటి పోషకాలు కలిగి ఉండి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో మెదడు పనితీరు చురుగ్గా మారుతుంది.
>> గంజి శరీరాన్ని చల్లబరుస్తుంది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. గంజి తాగడం లేదా శరీరానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడంతో పాటు నిగారిస్తుంది.
>> ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని సోడియం స్థాయులను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
>> గంజిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని దృఢంగా మారుస్తాయి. ఇతర ఇన్ఫెక్షన్లు, ఆనారోగ్యం నుంచి వేగంగా కోలుకునేందుకు సాయపడతాయి.
>> తక్కువ కెలోరీలు ఉండడంతో పాటు తొందరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది.
>> గంజిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.