Integrated Schools: ఐదువేల కోట్లతో చదువుల పేరిట ఒత్తిడిలేని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ప్రత్యేకతలు
Integrated Schools: ఐదువేల కోట్లతో చదువుల పేరిట ఒత్తిడిలేని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ప్రత్యేకతలు
• యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైంది...
• ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 5thక్లాస్ నుంచి 12th క్లాస్ వరకు విద్యాబుద్ధులు...
• ప్రతి నియోజకవర్గములో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్.. ప్రతి క్యాంపస్ 20 నుంచి 25 ఎకరాల్లో...
• దసరా పండుగకు ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్నాం...
• ఐదువేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు...
Integrated Schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐదువేల కోట్లతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నమన్నారు. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావలసిన నిధులు కేటాయించి విద్యపై దృష్టి పెడతామని చెప్పాము ఆ మేరకు పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 5thక్లాస్ నుంచి 12th క్లాస్ వరకు విద్యాబుద్ధులు ఇక్కడ నేర్పిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ కళాశాలలు పక్కాభవనాలు లేక కళ్యాణ మండపాలు, అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భవనాలు నిర్మించే ప్రాంతాలు...
దసరా పండుగకు ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చారిత్రాత్మకమైందని అన్నారు. కొడంగల్, హుస్నాబాద్, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, మధిర, నల్గొండ, మంథని, పాలేరు, వరంగల్, అందోలు, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి తొలి విడత పైలట్ ప్రాజెక్టులో భవనాలు నిర్మిస్తున్నామన్నారు.
బలహీన వర్గాలకు ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలని ఇందిరమ్మ ప్రభుత్వ నిర్ణయించిందన్నారు. 20 నుంచి 25 ఎకరాల్లో ప్రతి నియోజకవర్గములో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం.. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి మూడు నెలలుగా కసరత్తు చేసి ఓ రూపానికి తెచ్చిన యావత్ మంత్రిమండలి, చీఫ్ సెక్రటరీ మొదలు వివిధ శాఖల ఉన్న అధికారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉండగా ఇందులో 662 పాఠశాలలో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని అన్నారు.
గురుకులాల్లో కల్పించే సదుపాయాల్లో కొన్ని..
• విద్యార్థులు, ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ క్యాంపస్
• ఇన్నోవేటివ్ బోధన విధానం
• సహజసిద్ధంగా వెలుతురు వచ్చేలా భవనాలు
• తక్కువ ఖర్చుతో కూడిన మెయింటెనెన్స్ ఉండేలా నిర్మాణాల్లో సహజసిద్ధ మెటీరియల్ వినియోగం
• గ్రీన్ క్యాంపస్, సోలార్, విండ్ ఎనర్జీ సదుపాయాలు
• దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు
• వర్షపు నీటి సంరక్షణ
• సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆడిటోరియం
క్యాంపస్ లో ఉండే సౌకర్యాలివీ...
తరగతి గదులు, ల్యాబొరేటరీలు, కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, వసతిగృహాలు, డైనింగ్, కిచెన్, బహుళ వినియోగ హాళ్లు, సిబ్బందికి నివాసగృహాలు, క్లబ్లు; వైద్యశాల, ఇండోర్ స్పోర్ట్స్, క్రికెట్, ఫుట్బాల్ మైదానాలు, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, ఔట్డోర్ జిమ్, థియేటర్, ల్యాండ్ స్కేప్ కోర్టులు.
ఐదు వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు...
గత కొన్ని సంవత్సరాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఉష్ణోగ్రతలు, గాలి వాటం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆధునిక రెసిడెన్షియల్ భవనాల నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ ఒక్క సంవత్సరంలోనే మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలపై ఐదు వేల కోట్లు ఖర్చు చేయబోతుంది గత ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలకు ఒక ఏడాదిలో కేటాయించిన మొత్తం 73 కోట్లు మాత్రమే అన్నారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు అన్ని వర్గాల వారు కలిసి ఒక చోట ఓ కుటుంబములా చదువుకునే లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. కేవలం చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణ కాకుండా క్రీడలు, వినోదం వంటివి విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఏ కొరత లేకుండా చూసే కార్యక్రమంలో భాగంగా థియేటర్ నిర్మించి శాటిలైట్ ద్వారా పిక్చర్స్ సైతం ప్రదర్శించే ఆలోచనలో ఉన్నామన్నారు. పేద వర్గాల వారు వారి బిడ్డలను ఈ పాఠశాలల్లో చేర్పించి విరివిగా ప్రచారం నిర్వహించాలని కోరారు.