రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

IPPB: డిగ్రీ పాసైనవారికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. పూర్తి సమాచారం

Ippb recruitment apply online IPPB Recruitment 2024 IPPB Recruitment 2024 apply online IPPB Recruitment 2024 Notification IPPB Recruitment 2024
Peoples Motivation

IPPB: డిగ్రీ పాసైనవారికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. పూర్తి సమాచారం

Ippb recruitment apply online IPPB Recruitment 2024 IPPB Recruitment 2024 apply online IPPB Recruitment 2024 Notification IPPB Recruitment 2024 Notification PDF IPPB Recruitment 2024 Exam Date IPPB Recruitment 2024 syllabus IPPB Recruitment eligibility

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది. IPPB బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లో అక్టోబర్ 11 నుంచి GDS రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తు రుసుమును చెల్లించడానికి చివరి తేదీ 31 అక్టోబర్ 2024.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఈ రిక్రూట్మెంట్ ద్వారా.. భారత ప్రభుత్వంలోని పోస్టల్ శాఖ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) ఎగ్జిక్యూటివ్ నియమిస్తారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 344 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇకపోతే IPPB GDS ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024లో పాల్గొనడానికి

విద్యార్హతలు:-

అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి రెగ్యులర్ లేదా డిస్టెన్స్ మోడ్ లో ఏదైనా స్ట్రీమ్ లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి GDS గా పనిచేసిన 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి:-

ఈ రిక్రూట్మెంట్ లో పాల్గొనడానికి 1 సెప్టెంబర్ 2024 నాటికి, అభ్యర్థి కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే గరిష్ట వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. 

జీతం:-

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000/- జీతం ఇవ్వబడుతుంది. 

ఎంపిక విధానం:-

గ్రాడ్యుయేషన్ లో పొందిన మార్కుల ఆధారంగా GDS యొక్క ఈ రిక్రూట్మెంట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్ ఫీజు:-

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు రుసుము చెల్లించాలి.

ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయడానికి..

ముందుగా ippbonline.com అధికారిక వెబ్సైట్ ను  సందర్శించండి.

కెరీర్ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత, రిక్రూట్మెంట్ కోసం అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు తదుపరి పోర్టల్ లో న్యూ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేసి, అవసరమైన వివరాలను ఇచ్చి నమోదు చేసుకోండి.

దీని తర్వాత ఇతర వివరాలు, సంతకం, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి.

ఆపై నిర్ణీత రుసుమును జమ చేసి, పూర్తిగా నింపిన ఫారమ్ను సమర్పించి దాని ప్రింటవుట్ ను తీసుకొని భద్రంగా ఉంచుకోండి.

పూర్తి వివరాలకు కింది అధికారిక వెబ్‌సైట్ ను చూడగలరు.

https://www.ippbonline.com/web/ippb/current-openings

Comments

-Advertisement-