JOBS: ఐటీఐ అర్హతతో సీఎస్ఎల్ లో 307 పోస్టులుకు నోటిఫికేషన్ విడుదల
JOBS: ఐటీఐ అర్హతతో సీఎస్ఎల్ లో 307 పోస్టులుకు నోటిఫికేషన్ విడుదల
కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 307 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం
కేటగిరీల వారిగా పోస్టుల వివరాలు:-
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ - 299
టెక్నీషియన్ అప్రెంటిస్ - 8
మొత్తం పోస్టుల సంఖ్య - 307
ట్రేడ్ విభాగాలు:- ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్/ సివిల్), పెయింటర్ (జనరల్/ మెరైన్), అకౌంటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ బేకర్.
విద్యార్హతలు:-
అభ్యర్థులు పదో తరగతితోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
అలాగే ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (వీహెచ్ఎస్ఈ) ఉత్తీర్ఱత కలిగి ఉండాలి.
వయోపరిమితి:- అభ్యర్థుల వయస్సు 2024 అక్టోబర్ 23 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
నెలకు స్టైపెండ్ :-
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8,000 స్టైపెండ్ ఇస్తారు.
టెక్నీషియన్ అప్రెంటిస్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,000 స్టైపెండ్ అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ:- విద్యార్హతల్లో సాధించిన మార్కులు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:-
అభ్యర్థులు ముందుగా కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు చెందిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, గుర్తింపు పత్రాలు అప్లోడ్ చేయాలి.
అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:-
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 అక్టోబర్ 9
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 23
ముఖ్యాంశాలు:-
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 307 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల.
ఐటీఐ, ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 అక్టోబర్ 23
అధికారిక వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి