రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

NHAI Rajmarg Yatra: రహదారులపై జరిగే కీలక అప్డేట్స్ కోసం ఈ యాప్ పై క్లిక్ చేయండి

Peoples Motivation

NHAI Rajmarg Yatra: రహదారులపై జరిగే కీలక అప్డేట్స్ కోసం ఈ యాప్ పై క్లిక్ చేయండి

NHAI Rajmarg Yatra: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) జాతీయ రహదారులపై జరిగే కీలక అప్డేట్స్ కోసం ఒక సరికొత్త యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే కచ్చితంగా మ్యాప్ ఉండాల్సిందే. ఫాస్టాగ్ రీఛార్జి చేయడానికి మరో యాప్. ప్రయాణంలో ఏదైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయాలంటే అప్పటికప్పుడు గూగుల్లో వెతకాల్సిందే. ఇలా ఒక్కోదానికి ఒక్కోటి కాకుండా.. అన్నింటికీ కలిపి ఒక యాప్ ఉంటే ఎంత బాగుంటుందో కదూ! ఈ ఆలోచనకు తగ్గట్టే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) 'రాజ్మార్గ్యాత్ర' (Rajmargyatra) పేరుతో ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్లో రూట్ మ్యాప్స్ దగ్గర నుంచి స్మార్ట్ అలర్ట్స్ వరకు అనేక ఫీచర్లు ఉన్నాయి. వాటి వివరాలు ఇలా..

Nhai rajmarg yatra app download Rajmarg Yatra Login Rajmarg yatra app launched by Nhai rajmarg yatra app download apk Rajmarg Yatra app upsc Rajmargyatra website NHAI One app NHAI complaint status app

కీలక సమాచారం: జాతీయ రహదారులపై వెళుతున్నప్పుడు ప్రయాణికులకు అవసరమయ్యే కీలక సమాచారం ఈ యాప్లో లభిస్తుంది. రెస్టరంట్లు, పెట్రోల్ పంపులు, ఛార్జింగ్ స్టేషన్లు, ఆసుపత్రులు, ఏటీఎంలు, పోలీస్ స్టేషన్లు, పర్యటక ప్రదేశాల సమాచారం కనిపిస్తుంది. వాతావరణ స్థితి, ట్రాఫిక్ అలర్టులు కూడా లభిస్తాయి.

ఫిర్యాదులు అక్కడే: ప్రధాన రహదారులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే రాజ్మార్గ్ యాప్ లో రిపోర్ట్ చేయొచ్చు. 'Report An Issue On NH అనే ఆప్షన్ ఉంటుంది. దాని సాయంతో రహదారికి సంబంధించిన సమస్యను ఫొటో, వీడియోను జోడించి ఫిర్యాదు చేయొచ్చు. ఇందులో నమోదైన ఫిర్యాదులపై స్పందించి NHAI చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదు స్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

ఫాస్టాగ్ సర్వీసులు: ఫాస్టాగ్ కు సంబంధించిన సర్వీసులూ ఈ యాప్ నుంచి పొందొచ్చు. ఫాస్టాగ్ రీఛార్జి కోసం ఎన్హెచ్ఎఐ వివిధ బ్యాంకు పోర్టల్లతో కలసి పనిచేస్తోంది. కొత్త ఫాస్టాగ్ దరఖాస్తు, నెలవారీ పాస్లు, ఫాస్ట్ ట్యాగ్కు సంబంధించిన ఇతర సర్వీసులూ ఈ ప్లాట్ఫామ్ పై లభిస్తాయి.

ట్రాఫిక్ అప్డేట్లు: ఈ సర్వీస్ హైవేపై ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితుల గురించి మీకు సమాచారాన్ని చూపుతుంది. దీనితో మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఉత్తమ సమయాన్ని ఎంచుకోవచ్చు.

టోల్ ప్లాజా వివరాలు: Toll Plaza Enroute అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు బయల్దేరుతున్న ప్రాంతం, చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంటర్ చేసి సెర్పై క్లిక్ చేస్తే చాలు. ఆ రహదారిలో ఉండే టోల్ ప్లాజాల సంఖ్య, వాటి పేర్లు, కట్టాల్సిన మొత్తం వివరాలు డిస్ప్లే అవుతాయి.

Hotspots: దీని ద్వారా మీరు హైవేపై ఉన్న హాట్స్పాట్ ల గురించి కూడా సమాచారాన్ని పొందుతారు. ఇందులో రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ మొదలైన వాటి గురించిన సమాచారం ఉంటుంది.

స్మార్ట్ అలర్ట్: ఓవర్ స్పీడ్ నోటిఫికేషన్ సదుపాయం కూడా ఇందులో ఉంది. మీరు పరిమితికి మించి వేగంతో ప్రయాణిస్తే ఇది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎన్హెచ్ఎఐ ఈ సదుపాయం తీసుకొచ్చింది. దీని కోసం ప్రొఫైల్లోకి వెళ్లి స్మార్ట్ అలర్ట్, వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవాలి.

వాతావరణ అప్డేట్: ఈ ఫీచర్ ద్వారా మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. తద్వారా మీరు వాతావరణానికి అనుగుణంగా సురక్షితంగా ప్రయాణించవచ్చు.

ఇవి కూడా: హైవే అసిస్టెన్స్, పోలీస్ అసిస్టెన్స్, ఎమర్జెన్సీ నంబర్లు ఎమర్జెన్సీ ఆప్షన్ కనిపిస్తాయి. మీరు ప్రయాణిస్తున్న హైవే వివరాలు కూడా కనిపిస్తాయి. కావాలంటే మీ జర్నీని రికార్డ్ చేసుకోచ్చు. రాజ్మార్గ్ యాత్ర యాప్.. తెలుగు, ఇంగ్లిష్ తో సహా మొత్తం 12 భాషలకు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నంబర్ తో లాగిన్ అయితే చాలు ఈ సదుపాయాలన్నీ పొందొచ్చు. యాపిల్ యూజర్లూ దీన్ని వినియోగించొచ్చు.

Comments

-Advertisement-