-Advertisement-

Nobel Prizes 2024: విశిష్ట సేవలకు విలువైన పురస్కారం.. ఈ ఏడాది నోబెల్ గ్రహీతల గురించి ఇవి తెలుసా?

Nobel Prize winners Nobel Prize history Nobel Prize full info #NobelPrize2024 #importanceofwinners #InternationalNews #TeluguNews Nobel Prizes list
Peoples Motivation

Nobel Prizes 2024: విశిష్ట సేవలకు విలువైన పురస్కారం.. ఈ ఏడాది నోబెల్ గ్రహీతల గురించి ఇవి తెలుసా?

నోబెల్.. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం. మత, ప్రాంత వివక్ష లేకుండా మానవజాతి మేలుకోసం విశేష కృషి చేసినవారిని సమున్నతంగా గౌరవిస్తూ ఏటా అందించే అవార్డు ఇది. ఈ ఏడాది కూడా పలువురు ప్రముఖులను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. భౌతికశాస్త్రంలో ఏఐ రూపశిల్పులకు అవార్డు రాగా.. రసాయన శాస్త్రంలో ప్రోటీన్లపై పరిశోధనలకు వచ్చింది. అటు కీలకమైన మైక్రో RNకు మెడిసిన్ విభాగంలో పట్టం కట్టగా.. దేశాల మధ్య సంపద అసమానతల అంతానికి చేసిన కృషికి ఆర్థిక రంగంలో అవార్డులు వరించాయి. ప్రధానమైన శాంతి బహుమతిని జపాన్ సంస్థకు కేటాయించగా.. దక్షిణ కొరియా రచయిత హాన్ కాంగ్‌కు సాహిత్య అవార్డు దక్కింది. మరి, వీరు చేసిన ఆ పరిశోధనలేంటి? కీలకమైన ప్రోటీన్లపై పరిశోధనతో శాస్త్రవేత్తలు ఏం చెప్పాలనుకుంటున్నారు? శాంతి విభాగంలో నోబెల్ గెలుచుకున్న ఆ సంస్థ గొప్పదనం ఏంటి? తెలుసుకుందాం..

Nobel Prize winners Nobel Prize history Nobel Prize full info #NobelPrize2024 #importanceofwinners #InternationalNews #TeluguNews Nobel Prizes list


స్వీడెన్కు చెందిన దిగ్గజ రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ గుర్తుగా ఏటా డిసెంబర్ 10న ఈ పురస్కారాలు అందిస్తారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని నోబెల్ కమిటీ ఇందుకు ఎంపిక చేస్తుంది. సోమవారం వైద్య రంగంలో పురస్కార విజేతల ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ సీజన్ ప్రారంభమయ్యింది. అక్టోబరు 14 వరకు రోజూ ఒక్కో రంగంలో పురస్కారం అందుకునే వారి పేర్లను కమిటీ ప్రకటించింది. నోబెల్ అవార్డు కింద మిలియన్ డాలర్ల నగదు బహుమతి అందిస్తారు.


Nobel Prize in Psyciology (వైద్య రంగంలో నోబెల్):

వైద్య రంగంలో ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్ వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. మైక్రో RNAను కనుగొని, జన్యు నియంత్రణలో దాని పాత్రను గుర్తించడంపై చేసిన పరిశోధనలకుగానూ ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ స్వీడెన్ రాజధాని స్టాక్హోమ్ సోమవారం ప్రకటించింది. ఈ ఇద్దరు కనుగొన్న విషయాలు- మనిషి సహా జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా పని చేస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు కీలకమని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది.

నోబెల్ పురస్కార విజేతల్లో ఒకరైన విక్టర్ ఆంబ్రోస్- ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా మైక్రో ఆర్ఎన్ఏపై పరిశోధనలు చేశారు. మరో విజేత అయిన గ్యారీ రువ్కున్- ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రితోపాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఆయన పరిశోధనలు సాగించారు.

గతేడాది వైద్య రంగంలో నోబెల్ పురస్కారం- కాటలిన్ కరికో, డ్రూ విస్మ్యాన్కు దక్కింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టిన mRNA టీకాల అభివృద్ధికి ఉపకరించేలా చేసిన పరిశోధనలకుగానూ వీరిని అత్యున్నత అవార్డు వరించింది.


Nobel Prize in Physics (భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం):

ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం జాన్ జె.హాప్‌ఫీల్డ్‌, జెఫ్రీ ఈ.హింటన్‌ను వరించింది. మెషీన్ లెర్నింగ్‌ విత్ ఆర్టిఫీషియల్‌ న్యూరల్ నెట్‌వర్క్‌ ఆవిష్కరణ కోసం వీరిరువురూ చేసిన కృషికి గాను ఈ పురస్కారం ప్రకటిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ మంగళవారం ప్రకటించింది.

హాప్‌ఫీల్డ్‌ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో తన పరిశోధనలు చేయగా, హింటన్‌ టొరంటో విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ చేశారు. వీరు మెషీన్‌ లెర్నింగ్‌లో విశేషమైన కృషి చేశారు. వీరికి నోబెల్‌ ప్రైజ్‌ కింద 11 మిలియన్‌ స్వీడిష్ క్రోనార్‌లు (1 మిలియన్ అమెరికన్‌ డాలర్ల) అందిస్తారు. 1901 నుంచి ఇప్పటి వరకు మొత్తం 117 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించగా, 224 మంది దీనిని స్వీకరించారు.

ముచ్చటగా ముగ్గురు..

గతేడాది భౌతిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్‌ క్రౌజ్‌, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్‌ హ్యులియర్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ప్రకటించారు. పరమాణువుల్లోని (Atoms) ఎలక్ట్రాన్‌ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు, కాంతి తరంగాల ఆటోసెకండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకుగాను వీరికి నోబెల్‌ పురస్కారాన్ని అందజేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.భారీ నగదు బహుమతి


Nobel Prize in Chemistry (రసాయన శాస్త్రంలో నోబెల్‌):

రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్‌, డెమిస్‌ హస్సాబిస్‌, జాన్‌ ఎమ్‌ జంపర్‌కు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి వరించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకుగానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్‌ హసబిస్‌, జాన్‌ ఎం.జంపర్‌ను ప్రతిష్టత్మక నోబెల్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరక రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ తెలిపింది. కంప్యుటేషనల్ ప్రొటీన్‌ డిజైన్‌కుగానూ బెకర్‌, ప్రొటీన్‌ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కు గానూ డెమిస్‌, జంపర్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

గత ఏడాది నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణ, అభివృద్ధికిగాను ముగ్గురు శాస్త్రవేత్తలను రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి(62), లూయిస్‌ బ్రూస్‌(80), అలెక్సీ ఎకిమోవ్‌(78)క 2023కి నోబెల్‌ బహుమతిని స్వీడెన్లోని స్టాక్హోమ్లో జరిగిన కార్యక్రమంలో రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెన్స్‌ ప్రకటించింది. నానో పార్టికల్స్‌, క్వాంటమ్‌ డాట్‌లను LED లైట్లు, టీవీ స్ర్కీన్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. క్యాన్సర్‌ కణజాలాన్ని తొలగించేందుకు సర్జన్‌లకు మార్గనిర్దేశం చేయడానికి ఈ సాంకేతికతనే వినియోగిస్తున్నారు.

ఈ ఏడాది వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం అక్టోబర్‌ 14వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా, మంగళవారం భౌతికశాస్త్రంలో నోబెల్‌ అవార్డులను ప్రకటించారు. బుధవారం కెమిస్ట్రీలో నోబెల్‌కు పురస్కారానికి ఎంపికైన వారి జాబితా వెలువరించింది రాయరల్ స్వీడిష్ అకాడమీ. గురువారం సాహిత్యం విభాగానికి, శుక్రవారం నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను పేర్లను ప్రకటిస్తారు.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. నోబెల్ అవార్డు గ్రహీతలకు 11లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10లక్షల డాలర్లు) నగదు అందుతుంది. డిసెంబర్‌ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందిస్తారు.


Nobel Prize in Literature (సాహిత్యంలో నోబెల్ అవార్డు):

మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను కళ్లకు కట్టినట్లు రాసిన గద్యానికి గుర్తింపుగా సాహిత్య విభాగంలో సౌత్ కొరియాకు చెందిన హాన్ కాంగ్కు నోబెల్ అవార్డు ప్రకటించినట్లు స్వీడిష్‌ అకాడమీ తెలిపింది. హాన్‌ కాంగ్‌ 'ది వెజిటేరియన్‌' రచనకు గాను 2016లో అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ అందుకున్నారు. మాంసాహారం మానేయాలని ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఎలాంటి వినాశకర పరిణామాలకు దారితీసిందనే నేపథ్యంగా వెజిటేరియన్‌ నవల ఉంటుంది. 2018లో 'హ్యుమన్‌ యాక్ట్‌' నవల అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ ఫైనల్‌కు చేరింది.

సాహిత్య విభాగంలో ఇప్పటి వరకు 119 నోబెల్ పురస్కారాలు లభించాయి. వారిలో 17 మంది మహిళలు ఉన్నారు. చివరిగా 2022లో ఫ్రాన్స్కు చెందిన అన్నీ ఎర్నాక్స్ నోబెల్ పురస్కారం వరించింది. గతేడాది సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం- నార్వేకు చెందిన జాన్ ఫోసేను దక్కింది. ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని ఈ అవార్డును ప్రకటించారు. గతేడాది సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం- నార్వేకు చెందిన జాన్ ఫోసేను దక్కింది. ఆయన తన వినూత్న నాటకాలు, గద్యాలు మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని ఈ అవార్డును ప్రకటించారు.

Nobel Prize in Peace (నోబెల్ శాంతి పురస్కారం): 

శాంతి అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం కృషి చేస్తున్న సంస్థకు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. జపాన్ కు చెందిన నిహోన్ హిడంక్యోకు ఈ ఏడాది శాంతి బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

శాంతి అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సాధించడానికి హిరోషిమా, నాగసాకి అణుదాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో హిడాంక్యో సంస్థ ఏర్పడింది. నోబెల్‌ శాంతి అవార్డుతో హిరోషిమా, నాగ‌సాకి అణుబాంబు బాధితుల‌ను గౌర‌విస్తున్న‌ట్లు నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. భౌతిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, జ్ఞాప‌కాలు వేధిస్తున్నా జ‌పాన్ సంస్థ త‌మ అనుభ‌వంతో ప్ర‌జ‌ల్లో ఆశ‌, శాంతిని పెంపొదిస్తున్న‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది.

Nobel Prize in Economics (ఆర్థిక శాస్త్రంలో నోబెల్):

వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధనలు చేసిన ముగ్గురికి ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. డారన్ ఏస్మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్కు అవార్డు ఇస్తున్నట్లు స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. వీరు చేసిన పరిశోధనలు దేశాలు సమృద్ధి చెందడం వెనుక సాంఘిక వ్యవస్థల పాత్రను అర్థం చేసుకునేందుకు, వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలు తెలుసుకునేందుకు ఉపకరించాయని పేర్కొంది.

'ఆ విధానాలు ఉన్న దేశాలు అభివృద్ధి కావు'

"దేశాల మధ్య ఆదాయ వ్యత్యాసాలను తగ్గించడం మన ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో సాంఘిక వ్యవస్థలు ఎంత ముఖ్యమో ఈ పరిశోధకులు మనకు తెలియచెప్పారు. చట్టాలను సరిగా పాటించని సమాజాలు, ప్రజలను దోచుకునే వ్యవస్థలు ఉన్న దేశాలు అభివృద్ధి కావు, సరైన దిశలో మార్పు చెందవు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు వీరి పరిశోధన మనకు ఉపకరిస్తుంది" అని నోబెల్ కమిటీ తెలిపింది.

అప్పటి నుంచి అర్థశాస్త్రంలో నోబెల్...

నోబెల్ పురస్కార విజేతలైన ఏస్మొగ్లు, జాన్సన్- మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పని చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో రాబిన్సన్ పరిశోధనలు చేస్తున్నారు. అర్థ శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని సాంకేతికంగా నోబెల్ ప్రైజ్గా పరిగణించరు. డైనమైట్ను కనిపెట్టిన 19వ శతాబ్దపు స్వీడిష్ వ్యాపారి, రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఐదు రంగాల్లో (వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి) నోబెల్ పురస్కారాన్ని ఇవ్వడం మాత్రమే ప్రారంభించారు. అయితే, ఆయన గుర్తుగా బ్యాంగ్ ఆఫ్ స్వీడన్ 1968 నుంచి ఆర్థిక శాస్త్రంలో పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించింది. అధికారికంగా దీనిని బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ అంటారు. కానీ, మిగిలిన ఐదు పురస్కారాలతోపాటే ఆర్థిక శాస్త్రం అవార్డును కూడా నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న విజేతలకు ప్రదానం చేస్తారు.

Comments

-Advertisement-