-Advertisement-

Palle Panduga: పల్లె పండుగకు వేళాయే..!‌ అభివృద్ధి పనులకు అంకురార్పణ..!!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

Palle Panduga: పల్లె పండుగకు వేళాయే..!‌ అభివృద్ధి పనులకు అంకురార్పణ..!!

Palle Panduga: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పేరిట సోమవారం ప్రారంభించనున్నారు. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనుల్ని చేపట్టనున్నారు. ఆగష్టు 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించారు. దీనికి వరల్డ్ రికార్డ్ దక్కింది. అప్పటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లెల్లో పనులు చేపడుతున్నారు.

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమలు కోసం ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాల మేరకు, పల్లెల్లో పనులు ప్రారంభిచాలని ఆదేశించారు. మొత్తం 30 వేల ప‌నులు చేపట్టాల్సి ఉండగా, పెండింగ్లో మూడు వేల కిలో మీట‌ర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీట‌ర్ల మేర తారు రోడ్లు ఉన్నాయి. వీటితో పాటు రైతులకు ఉపయోగపడేలా పంట కుంట‌లు, ప‌శువుల షెడ్డులు, ఇంకుడు గుంత‌ల నిర్మాణం ప‌నుల్ని చేపట్టనున్నారు.

నేటి నుంచి 20 వరకు 'పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు...

పల్లె పండుగ కార్యక్రమంలో రూ.4,500 కోట్లు నిధులతో 30 వేల పనులు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కార్యక్రమ నిర్వహణపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులు, జిల్లాల కలెక్టర్లతో కొద్దిరోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 14 నుంచి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లెపండగ – పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల పనులకు భూమి పూజ చేయాలని సూచించారు. శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, సర్పంచులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

చేసినవి చేయాల్సినవీ...

ఈ ఆర్థిక సంవత్సరంలో 3వేల కి.మీ. సిమెంట్ రోడ్లు, 500 కి.మీ. బీటీ రోడ్లు, 65 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25 వేల నీటి కుంటలు, 22 వేల 525 గోకులాలు నిర్మించనున్నారు. అలాగే 30 వేల ఎకరాల్లో నీటి నిల్వకు ఉపయోగపడే ట్రెంచులను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే 200 కి.మీ. సిమెంట్ రోడ్లు, 50 కి.మీ. బీటీ రోడ్లు, 53,257 ఎకరాల్లో హార్టికల్చర్, 11,512 ఫార్మ్ పాండ్లు, 1900 గోకులాలు, 20,145 ఎకరాలలో ట్రెంచులు పూర్తి చేశారు. మిగతా పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయనున్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో ఉపాధి హామీ పనుల ఉపయోగంపై ప్రజలకు తెలియజేస్తారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2024-25 సంవత్సరంలో చేపట్టబోయే పనులు, పూర్తి చేసిన పనుల వివరాలు తెలియపరిచే సిటిజెన్ నాలెడ్జ్ బోర్డు ఏర్పాటు చేస్తారు.

Comments

-Advertisement-