రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

RRB: బిగ్ అలర్ట్ -రైల్వే పరీక్షల తేదీలు మారాయ్, ఓసారి చెక్ చేసుకొండి

RRB Latest updates Upcoming Railway Exams 2024 List of Railway exams RRB official website RRB exam syllabus Railway exam eligibility Railway Exam Date
Peoples Motivation

RRB: బిగ్ అలర్ట్ -రైల్వే పరీక్షల తేదీలు మారాయ్, ఓసారి చెక్ చేసుకొండి

రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల..

రైల్వే పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు గమనిక..

మొత్తం 41,500 పోస్టులకు కొత్త పరీక్షల తేదీలు ప్రకటన..

రివైజ్డ్ నోటీసు జారీ చేసిన రైల్వే బోర్డు..

రైల్వే పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రైల్వే పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీల్లో మార్పు చేసింది. ఇందుకు సంబంధించిన రివైజ్డ్ నోటీసును రైల్వే అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలోని జోన్లలో వివిధ ఉద్యోగాలకు గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష తేదీలను ప్రకటించింది. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాలని రైల్వే బోర్డు తెలిపింది.


RRB Latest updates Upcoming Railway Exams 2024 List of Railway exams RRB official website RRB exam syllabus Railway exam eligibility Railway Exam Date

అన్ని రైల్వే జోన్లలో మొత్తం 41,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్, 452 ఆర్పీఎఫ్ ఎస్సై, 14,298 టెక్నీషియన్, 7951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి నియామక పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ప్రకటించారు. వీటిలో రైల్వే టెక్నీషియన్, ఆర్పీఎఫ్ ఎస్సై, జేఈ రాత పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసింది. కానీ అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష మాత్రం యధావిథిగా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు అన్నీ నవంబరు, డిసెంబరు నెలల్లోనే జరగనున్నాయి.

మారిన ఆర్ఆర్బీ రాత పరీక్ష తేదీలు 

• CEN 01/ 2024- అసిస్టెంట్ లోకో పైలట్(సీబీటీ-1)- 25.11.2024 నుంచి 29.11.2024 (మార్పు లేదు)

• CEN RPF SI 01/2024- ఆర్పీఎఫ్ ఎస్సై- 02.12.2024 నుంచి 12.12.2024

• CEN 02/2024- టెక్నీషియన్- 18.12.2024 నుంచి 29.12.2024

• CEN 03/2024- జూనియర్ ఇంజినీర్(JE)- 13.12.2024 నుంచి 17.12.2024

ఈ పరీక్షల తేదీలు ప్రకటించలేదు 

ఎన్టీపీసీ, పారామెడికల్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఎన్టీపీసీ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నాన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. పోస్టులను అనుసరించి రాత పరీక్షలు, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

అభ్యర్థులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

• పరీక్షల నిర్వహణకు పది రోజులు ముందుగానే ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలను రైల్వే బోర్డు వెల్లడించనుంది.

• నాలుగు రోజుల ముందే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

• పరీక్షకు ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ తప్పనిసరి. అందుకే పరీక్షకు వెళ్లినప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకువెళ్లాలి.

• అభ్యర్థులు రైల్వే పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లను మాత్రమే చూడాలి.

• ఉద్యోగాల నియామకాలు అన్నీ పారదర్శకంగా మాత్రమే జరుగుతాయి. ఎవరైనా తప్పుదోవ పట్టించాలని చూస్తే జాగ్రత్త అవసరం.

• ఆర్ఆర్బీ ఎంపికలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెరిట్ పై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

Comments

-Advertisement-