Skill University: స్కిల్ యూనివర్సిటీ కోసం... రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల విరాళం అందించిన అదానీ
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
By
Peoples Motivation
Skill University: స్కిల్ యూనివర్సిటీ కోసం... రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల విరాళం అందించిన అదానీ
- అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత
- కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు
- రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. యువతలో నైపుణ్యం పెంచేలా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ స్కిల్ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణను ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ప్రతి ఏడాది లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా రానున్న కాలంలో ఈ యూనివర్సిటీని విస్తరించనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి.
Comments