రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TGPSC: కీల‌క అప్‌డేట్.. గ్రూప్‌-3 ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ విడుదల

Tspsc group 3 exam date Tspsc group 3 notification Tspsc group 3 syllabus TSPSC Group 4 Tspsc group 3 salary TSPSC Group 3 Exam Date 2024 TSPSC Group
Peoples Motivation

TGPSC: కీల‌క అప్‌డేట్.. గ్రూప్‌-3 ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ విడుదల

నవంబర్‌ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహణ..

ప‌రీక్ష‌ల‌కు వారం రోజుల ముందునుంచే హాల్‌టికెట్లు విడుదల..

మొత్తం 1,388 పోస్టుల భర్తీకి ప్రకటన..

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది అభ్య‌ర్థుల‌ దరఖాస్తు..

Tspsc group 3 exam date Tspsc group 3 notification Tspsc group 3 syllabus TSPSC Group 4 Tspsc group 3 salary TSPSC Group 3 Exam Date 2024 TSPSC Group 3 Notification PDF download TSPSC Group 2

తెలంగాణ‌లో గ్రూప్‌-3 అభ్య‌ర్థుల‌కు టీజీపీఎస్‌సీ (తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌) తాజాగా కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ఇప్ప‌టికే వెల్లడించిన బోర్డు. నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కీలక సమాచారం తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ తాజాగా షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది... ఇక ప‌రీక్ష‌ల‌కు వారం రోజుల ముందునుంచే హాల్‌టికెట్ల‌ను అందుబాటులో ఉంచుతామ‌ని బోర్డు తెలిపింది. అలాగే మోడ‌ల్ ఆన్సర్ బుక్‌లెట్ల‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు తెలియ‌జేసింది. 

కాగా, మొత్తం 1,388 గ్రూప్‌-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను టీజీపీఎస్‌సీ ప్రకటించింది.

Comments

-Advertisement-