-Advertisement-

TTD: 19 నుంచి జనవరి నెల శ్రీవారి దర్శనం, సేవల టికెట్ల జారీ

ttd darshan online booking availability ttd online ttd darshan tickets ttd 300 rs darshan online booking availability ttd login ttd online booking ttd
Peoples Motivation

TTD: 19 నుంచి జనవరి నెల శ్రీవారి దర్శనం, సేవల టికెట్ల జారీ

• జనవరి నెల కోటా శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

• 19 నుంచి 23వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దర్శన టికెట్ల బుకింగ్‌కు అవకాశం

• లక్కీ డిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు

• రూ.300 టికెట్ల కోటా 24న విడుదల 

ttd darshan online booking availability ttd online ttd darshan tickets ttd 300 rs darshan online booking availability ttd login ttd online booking ttd

భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈనెలలో అందుబాటులోకి తేనుంది. 19న అర్జిత సేవల కోటాను విడు దల చేయనుంది. వీటిలో కొన్నింటిని ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోటా కింద ఈనెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. 

• 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా, ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను అందుబాటులోకి తేనున్నారు.

• ఈనెల 23న ఉదయం 10 గంటలకు అంగప్ర దక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.

• ఈనెల 24న ఉదయం 10 గంటలకు జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటాను అందుబాటులో తెస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.

Comments

-Advertisement-