WCL: WCL లో ఐటీఐ అర్హతతో 902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
WCL: WCL లో ఐటీఐ అర్హతతో 902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
WCL: కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ (WCL) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం భారీ రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 902 పోస్టులకు అభ్యర్థులను నియమిస్తారు.
ముఖ్యమైన సమాచారం
ఈ నోటిఫికేషన్ ద్వారా 902 పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆ ఉద్యోగుల విషయానికి వస్తే..
1. కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 171 పోస్టులు
2. ఫిట్టర్ – 229 పోస్ట్లు
3. ఎలక్ట్రిషియన్ – 251 పోస్టులు
4.వెల్డర్- 62 పోస్టులు
5. వైర్మ్యాన్ – 19 పోస్ట్లు
6. సర్వేయర్ – 18 పోస్టులు
7. మెకానిక్ డీజిల్ – 39 పోస్టులు
8. డ్రాఫ్ట్స్మన్ (సివిల్) – 7 పోస్టులు
9. మెషినిస్ట్- 9 పోస్టులు
10. టర్నర్- 17 పోస్ట్లు
11. పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ - 19 పోస్టులు
12. సెక్యూరిటీ గార్డ్ – 61 పోస్టులుగా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:-
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 15 అక్టోబర్ 2024
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 28 అక్టోబర్ 2024 వరకు
వయోపరిమితి:-
అభ్యర్థి కనీస వయస్సు 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలు:-
దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో NCVT లేదా SCVT నుండి ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
జీతం:-
ఇకపోతే, ఒక సంవత్సర ITI అభ్యర్థులకు ప్రతి నెలా రూ.7,700 పొందుతారు. రెండేళ్ల ఐటీఐ ఉన్నవారికి ప్రతి నెలా రూ.8,050 లభిస్తుంది. ఫ్రెషర్ అభ్యర్థులకు ప్రతి నెలా రూ.6,000 ఇవ్వబడుతుంది.
ఇతర సమాచారం కోసం నోటిఫికేషన్ ను చదవండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ వెబ్సైట్ పై క్లిక్ చేసి వివరాలు చూడగలరు.