Wine Shop Tenders: ఊపందుకున్న మద్యం షాపుల దరఖాస్తులు..ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం
Wine Shop Tenders: ఊపందుకున్న మద్యం షాపుల దరఖాస్తులు..ప్రభుత్వానికి రూ.1000 కోట్ల ఆదాయం
• ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం..
• 14న కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల లాటరీ..
• 12, 13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి..
• 50 వేలు దాటిన దరఖాస్తులు - 14న మద్యం షాపులు కేటాయింపు..
రాష్ట్రంలోని మద్యం షాపులకు ఇప్పటి వరకూ 50 వేల ధరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం వచ్చింది. అక్టోబరు 11 వరకు మద్యం షాపుల దరఖాస్తుల గడువు పెంపునకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అన్ లైన్లో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంది. అక్టోబరు 12, 13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన చేయనున్నారు. 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ వేయనున్నారు. అక్టోబరు 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు నడవనున్నాయి.
14న కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల లాటరీ...
వివిధ వర్గాల నుండి అందిన వినతుల మేరకు మద్యం షాపుల కోసం నిర్దేశించిన దరఖాస్తుల సమర్పణ గడువును అక్టోబరు 11 వరకు పొడిగించినట్లు అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. ఆన్ లైన్లో సహా అన్ని విధానాలలో దరఖాస్తులకు అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుందని అన్నారు. అక్టోబరు 12, 13 తేదీలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, 14వ తేదీన అయా జిల్లాలలో కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీస్తారని వివరించారు. అదే రోజు కేటాయింపు ప్రకియను పూర్తి చేస్తామని, అక్టోబరు 16వ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అనుసరించి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని నిషాంత్ కుమార్ పేర్కొన్నారు.