-Advertisement-

తాజా విద్యా ఉద్యోగ సమాచారం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

తాజా విద్యా ఉద్యోగ సమాచారం

ముఖ్యాంశాలు 

👉CAT: క్యాట్ 2024 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే

👉SSC: ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 'ఎడిట్ ఆప్షన్'.. రాత పరీక్ష ఎప్పుడంటే

👉TG TET: నవంబర్ 7 నుంచి టెట్ అప్లికేషన్లు..!!

👉TG Inter: తెలంగాణ ఇంటర్‌ ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే

👉AP Tenth: ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు! ఎప్పటి వరకంటే

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

*******************

CAT: క్యాట్ 2024 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఇవే

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) 2024 మరో 20 రోజుల్లో పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు తాగి విడుదలయ్యాయి. క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశంలో మొత్తం 170 నగరాల్లో నవంబర్ 24న క్యాట్ పరీక్ష నిర్వహించబడుతుంది.

ఆన్‌లైన్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ పరీక్షలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఫలితాలు వెలువడుతున్నాయి. క్యాట్‌లో సాధించిన పర్సన్‌టైల్‌ ఆధారంగా ఐఐఎంలలో సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఇతర కాలేజీల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు.

క్యాట్ 2024 అడ్మిట్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.👇
https://cdn.digialm.com/EForms/configuredHtml/32842/89884/login.html


*******************


SSC: ఎస్సెస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 'ఎడిట్ ఆప్షన్'.. రాత పరీక్ష ఎప్పుడంటే

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్(జీడీ) ఉద్యోగాల భర్తీకి ఇటీవల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చుకోడానికి స్టాఫ్ సెలక్షన్ కమీషన్(SSC) ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను జారీ చేసింది. కానిస్టేబుల్‌ నియామక పరీక్ష దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్‌ నవంబర్‌ 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తుది గడువులోగా తమ దరఖాస్తులో మార్పుచేర్పులు చేసుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ కింద వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ఇంగ్లీష్, హిందీ భాషలతోపాటు తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాతపరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

*******************

TG TET: నవంబర్ 7 నుంచి టెట్ అప్లికేషన్లు..!!

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) ఆన్లైన్అప్లికేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానున్నది. షెడ్యూల్ ప్రకారం..

మంగళవారం నుంచే ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల ప్రక్రియ.. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా7వ తేదీకి వాయిదా పడింది. ఇన్ఫర్మేషన్ బులిటెన్, డిటెయిల్డ్ నోటిఫికేషన్ గురువారం https://schooledu.telangana.gov.in/ISMS వెబ్ సైట్లో పెడ్తామని టెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సోమవారం టెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జనవరి 1 నుంచి 20 వరకు ఆన్లైన్ లో టెట్ పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించారు. అయితే, అప్లికేషన్ ఫీజు విషయం పేర్కొనలేదు. మే నెలలో నిర్వహించిన టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే తర్వాత నిర్వహించే టెట్లో ఉచితంగానే అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తామని సర్కారు గతంలో ప్రకటించింది. దీనిపై సర్కారు పెద్దలతో విద్యాశాఖ అధికారులు ఇంకా మాట్లాడకపోవడంతోనే, ఈ ప్రక్రియ ఆగిపోయినట్టు తెలుస్తోంది.

*******************


TG Inter: తెలంగాణ ఇంటర్‌ ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే

విద్యార్ధులకు తెలంగాన ఇంటర్మీడియట్ బోర్డ్‌ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. నవంబర్ 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఆలస్య రుసుముతో ఫీజులు చెల్లించే అవకాశం కల్పించారు. డిసెంబర్‌ 4వ తేదీ వరకు రూ. 100 జరిమానాతో ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ. 500 జరిమానాతో డిసెంబర్ 12 వరకు చెల్లించవచ్చు. రూ. 1000 జరిమానాతో డిసెంబర్ 18 వరకు, రూ. 2000 జరిమానాతో డిసెంబర్ 27 వరకు గడువు ఫీజును చెల్లించే అవకాశం కల్పించారు.

పరీక్ష ఫీజు వివరాలివే..

• ఫస్టియర్‌ జనరల్ కోర్స్ అభ్యర్థులు రూ.520/-

• ఫస్టియర్‌ ఒకేషనల్ కోర్స్ – ప్రాక్టికల్స్ తో అభ్యర్థులు రూ.750

• సెకండియర్‌ జనరల్ కోర్స్ ఆర్ట్స్ అభ్యర్థులు రూ.520

• సెకండియర్‌ జనరల్ కోర్స్ సైన్స్ అభ్యర్థులు రూ.750

• సెకండియర్‌ ఒకేషనల్ కోర్స్ అభ్యర్థులు (థియరీ+ప్రాక్టికల్స్‌) రూ.750గా నిర్ణయించారు.

*******************

AP Tenth: ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు! ఎప్పటి వరకంటే

అమరావతి, నవంబర్‌ 6: 2024-25 విద్యా సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్ 28వ తేదీ నుంచి ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 11వ తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించవచ్చని డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. తాజాగా ఆ గడువును పొడిగించినట్లు ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి మరో ప్రకటనలో తెలిపారు. తాజా సవరణ మేరకు 2024-25 విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్‌ 18వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్‌ 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 3 వరకు, రూ.500 ఆలస్య ఫీజుతో డిసెంబర్‌ 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌ లో స్కూల్‌ లాగిన్‌లో విద్యార్ధుల ఫీజు చెల్లించాలని డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్ధులు తమ ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లిస్తే.. వారు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తారు. నామినల్‌ రోల్స్‌ సమర్పించేందుకు, ఫీజు చెల్లింపునకు మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడీతో పోల్చి విద్యార్థి నామినల్‌ రోల్స్‌లో మార్పులు చేసేందుకు హాల్‌టికెట్‌ జారీకి ముందు ఎడిట్‌ అవకాశం కల్పిస్తామని డైరెక్టర్‌ దేవానందరెడ్డి వివరించారు. పదో తరగతిలో అన్ని సబ్జెక్టులకు/ మూడు సబ్జెక్టులకు మించి అయితే రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు రూ.110 చెల్లించాలి. వొకేషనల్‌ విద్యార్థులు అదనంగా మరో రూ.60, నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్నవారు రూ.300, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌కు రూ.80 చెల్సించవల్సి ఉంటుందని ఆయన తెలిపారు.



Comments

-Advertisement-