Free Bus: మహిళలకు గుడ్ న్యూస్.. సంక్రాంతిలోపు ఉచిత బస్సు ప్రయాణం
Free Bus: మహిళలకు గుడ్ న్యూస్.. సంక్రాంతిలోపు ఉచిత బస్సు ప్రయాణం
• సంక్రాంతిలోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..
• సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నాం..
• నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం..
• తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్.. ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదు..
• ఏపీలో రెండు రోజులు.. బెంగళూరు ప్యాలెస్‌లో ఆరు రోజులు ఉంటారని
-రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం పథకం) మొదలుకానున్న నేపథ్యంలో మరో పథకంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సంక్రాంతి లోపల ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) కీలక ప్రకటన చేశారు. ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం పథకం) మొదలుకానున్న నేపథ్యంలో మరో పథకంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సంక్రాంతి లోపల ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని.. ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ ఏవేవో ఊహించుకొని మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మరన్నారు. ఏపీలో రెండు రోజులు.. బెంగళూరు ప్యాలెస్‌లో ఆరు రోజులు ఉండే జగన్‌కు ప్రజల గురించి ఏం తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (శనివారం) విజయనగరంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ నినాదంతో ముందుకు వెళుతున్నామని మంత్రి బీసీ జానార్ధన్ పేర్కొన్నారు.