Police Jobs: కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్
AP Police Recruitment
https://slprb.ap.gov.in/
SLPRB AP gov in
SLPRB login
SLPRB Result
SLPRB notification
SLPRB admit card
www.slprb.ap.gov.in apply
By
Peoples Motivation
Police Jobs: కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్
గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పలు కారణాలతో నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLRB) ఇన్ఛార్జి ఛైర్మన్ ఆకే రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 3గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు https://slprb.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభ్యర్థులకు గతేడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. 4,59,182 మంది ప్రీమిలినరీ పరీక్షకు హాజరు కాగా ..95,208 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించారు. 91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఫిజికల్ టెస్ట్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.
మరోసారి అవకాశం..
ఫిజికల్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 3గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు https://slprb.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్ష అనంతరం కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పలు కారణాల వల్ల నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం.. నిలిచిన భర్తీ ప్రక్రియను తాజాగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.
Comments