కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలా.. అయితే ఆన్లైన్లో ఇలా ఈజీగా అప్లై చేసుకోండిలా!
కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలా.. అయితే ఆన్లైన్లో ఇలా ఈజీగా అప్లై చేసుకోండిలా!
మీరు కొత్తగా ఇండేన్ వంటగ్యాస్(LPG) కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, అందుకోసం గతంలో మాదిరిగా ఏజెన్సీ వద్దకు వెళ్లి అక్కడ ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేటి టెక్నాలజీ యుగంలో అన్ని రంగాల మాదిరిగానే గ్యాస్ పంపిణీ సంస్థలు సేవలు సులభతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మీరు ఉన్న చోటు నుంచే చాలా ఈజీగా కొత్త గ్యాస్ కనెక్షన్కి అప్లై చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇంతకీ, ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ తీసుకోవడానికి కావాల్సిన పత్రాలేంటి? సింపుల్గా ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం..
గ్యాస్ బుకింగ్ కొరకు అవసరమైన పత్రాలు:
• ఆధార్ కార్డు
• ఓటర్ ఐడీ
• పాస్ పోర్ట్
• విద్యుత్/టెలిఫోన్/నీటి బిల్లు
• ఇంటి రిజిస్ట్రేషన్ పత్రం
• బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్
• డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిలో ఏదో ఒకటి గుర్తింపు పత్రంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
గ్యాస్ బుకింగ్ కొరకు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలంటే..
> ఇందుకోసం ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్లో ఇండేన్ గ్యాస్ అధికార వెబ్సైట్ని సందర్శించాలి.
> తర్వాత హోమ్ పేజీలో కనిపించే 'New Gas Connection' అనే లింక్పై క్లిక్ చేయాలి.
> అనంతరం ఓపెన్ అయిన అప్లికేషన్ ఫారమ్ను నింపాలి.
> స్టేట్, పంపిణీదారు పేరు, మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి ముఖ్యమైన వివరాలన్నింటిని ఎంటర్ చేయాలి.
> ఆ తర్వాత అక్కడ వచ్చిన క్యాప్చా కోడ్‌ను టైప్ చేసి 'Submit' బటన్పై నొక్కాలి.
> అనంతరం అవసరమైన KYC పత్రాలు, ఐడీ, అడ్రస్ ప్రూఫ్, మీ పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేయాలి.
> తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అనంతరం మీ పత్రాలు ధృవీకరించబడతాయి.
> అప్పుడు మీరు నమోదుచేసిన వివరాలన్నీ సరైనవి అయితే.. మీ అప్లికేషన్ ఆమోదించబడుతుంది. దాంతో మీకు ఇండేన్ గ్యాస్ కొత్త కనెక్షన్ వచ్చేస్తుంది.
ఆఫ్లైన్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో గ్యాస్ కొత్త కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే..
> ముందుగా మీ దగ్గరలోని ఇండేన్ LPG డిస్ట్రిబ్యూటర్ కార్యాలయానికి వెళ్లాలి.
> ఒకవేళ మీకు తెలియకుంటే.. ఇండేన్ గ్యాస్ కస్టమర్ కేర్కు కాల్ చేయడం ద్వారా కూడా సమీపంలోని కార్యాలయాన్ని తెలుసుకోవచ్చు.
> ఆఫీసుకు వెళ్లిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఇస్తారు.
> అందులో మీ వ్యక్తిగత వివరాలను కరెక్ట్గా నింపాలి. ఆపై దానికి ఐడీ, అడ్రస్ ప్రూఫ్ వంటి KYC పత్రాలను జత చేసి డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి.
> అదేవిధంగా, మీకు సబ్సిడీ వర్తిస్తే అందుకోసం రెండు ఫొటో కాపీలు, సబ్సిడీ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.
> ఫార్మాలిటీ కంప్లీట్ తర్వాత.. మీ గ్యాస్ డీలర్ కొత్త కనెక్షన్ విషయాన్ని ఫోన్ మెసేజ్ ద్వారా లేదా ఈ-మెయిల్ ద్వారా కన్ఫార్మ్ చేస్తారు