రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహణ

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహణ

• ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి.... 

• ట్రాఫిక్ నిబందనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలి.... 

 -జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS ఆదేశాలమేరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ లలో అనగా ఆళ్లగడ్డ,నంద్యాల,ఆత్మకూరు,డోన్ సబ్ డివిజన్ లలో పోలీస్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

➡️నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ లో పాల్గొన్నారు.  

➡️ఈ ర్యాలీ టేక్కే మార్కెట్ యార్డ్ నుండి సాయిబాబా నగర్,గవర్నమెంట్ హాస్పిటల్ ,పద్మావతి నగర్, మున్సిపల్ ఆఫీస్, సంజీవనగర్ గేట్, ఆర్టీసీ బస్టాండ్ ,శ్రీనివాస సెంటర్ ,గాంధీ చౌక్ మీదుగా తిరిగి టెక్కే మార్కెట్ యార్డ్ కు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 

➡️ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనచోదకులు హెల్మెట్‌ ధరించి వాహానాలు నడపాలని అలా హెల్మెట్‌ ధరించి వాహనం నడపడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. 

➡️ఈ నూతన సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి గాని మరియు పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపడం కానీ చేయకూడదు అనే సంకల్పాన్ని ప్రతిఒక్కరు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.   

➡️అలాగే మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ మరియు ట్రిపుల్ డ్రైవింగ్ వంటివి చేయకూడదు అని అలా చేసిన వారికి నంద్యాల పోలీసులు గట్టిగా పనిచేసి జరిమాన విదించి వారితో ఆ జరిమాన మొత్తాన్ని వసూలు చేయడం కూడా జరుగుతుందని తెలియచేసినారు. 

➡️కావున ప్రజలందరూ ట్రాఫిక్ నిబందనలు పాటించి సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. 

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

Comments

-Advertisement-