రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

49,218 మందికి రూ. 326 కోట్ల సబ్సిడీతో రుణాలు అందిస్తాం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

49,218 మందికి రూ. 326 కోట్ల సబ్సిడీతో రుణాలు అందిస్తాం

• ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం, మైనార్టీల పక్షపాతి

- మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్, చైర్మన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ


విజయవాడ, జనవరి 24 (పీపుల్స్ మోటివేషన్):-

 రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీల అభివృద్ది, సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అందించిన  వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.. బందరు రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ మైనార్టీలకు రూ. 326 కోట్ల సబ్సిడీ రుణాలను నాలుగు స్లాబ్స్ లలో  49,218 మంది లబ్దిదారులకు అందిస్తామన్నారు. మొదటి స్లాబ్ గా 1 లక్ష వరకు, రెండో స్లాబ్ లో 1 నుంచి 3 లక్షలు, మూడో స్లాబ్ లో 3 నుంచి 5 లక్షల, నాలుగో స్లాబ్ క్రింద 8 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు.  ఈ రుణాలను లబ్ధిదారులు చెల్లించాల్సిన 10 శాతం షేర్ కూడా వారు చెల్లించకుండా అందిస్తున్నామన్నారు. 

గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం, మైనార్టీలకు సబ్సిడీ పథకాలు అందిస్తున్నామన్నారు. గతంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. అదేవిధంగా జిల్లాల్లో కూడా ఏవిధమైన యాక్టివిటీస్ నిర్వహించలేదన్నారు. యువగళంలో మంత్రి నారా లేకేష్ ముస్లిం, మైనార్టీల సమస్యలు నోట్ చేసుకున్నారన్నారు. దానిఫలితంగానే నేడు వేల మందికి సబ్సిడీ పథకాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. మొదటి నుంచి ముస్లిం, మైనార్టీలకు అండగా ఉంటున్న నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీల కళాశాలలు, ఐటీఐ కళాశాలలు మూతవేశారన్నారు. అదేవిధంగా కడపలో 25 కోట్లతో హజ్ హౌజ్ నిర్మిస్తే దానిని కూడా వృధా చేశారన్నారు. కర్నూలులో అబ్ధుల్ హక్ యూనివర్శిటీ పనులు 40 శాతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దానిని కూడా కుంటుపడేలా చేసారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలలో పేదరికం ఎక్కువగా ఉందని దాన్ని తొలగించేందుకు అవిరళ కృషి చేస్తున్నారన్నారు. అందుకే పూర్ టూ రిచ్ కాన్సెప్ట్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు ముస్లిమ్స్ కు అందించి వారిని ధనవంతులుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. మా ప్రభుత్వ హయాంలో అభివృద్దికి కేరాఫ్ గా రాష్ట్రాన్ని మార్చుతామన్నారు. 

పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ వీసీ మరియు ఎండీ కే. యాకూబ్ భాషా, జనరల్ మేనేజర్ షణ్ముఖరావు పాల్గొన్నారు.

Comments

-Advertisement-