మందుబాబులకు అడ్డాగా మారిన ప్రభుత్వ పాఠశాల
General News telugu latest news telugu intresting news telugu intresting facts
Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
By
Peoples Motivation
మందుబాబులకు అడ్డాగా మారిన ప్రభుత్వ పాఠశాల
శిరివెళ్ల, జనవరి 27 (పీపుల్స్ మోటివేషన్):- తమ గ్రామంలోని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు పునాది వేస్తున్న సరస్వతీ నిలయం ప్రభుత్వ పాఠశాల సాయంత్రం అయ్యేసరికి మందుబాబులకు అడ్డగా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణం మద్యం తాగి పడేసిన కాళీ మద్యం సీసాలు ప్లాస్టిక్ గ్లాసులు ఇతర వ్యర్థ పదార్థాలతో నిండిపోతున్నదని గగ్గోలు పెడుతున్న సంఘటన శిరివెళ్ల మండలం, జీనపల్లే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంటున్నది. అక్షరాలు దిద్దుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని పంతులు చెప్పిన చెప్పిన హోంవర్క్ తిరిగి అప్పగించాలని బడికి వచ్చే చిన్నారులకు మద్యం సీసాలు తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు తిని పడేసిన చికెన్ ఎముక ముక్కలు ప్లాస్టిక్ కవర్లు ఇతర ఆయిల్ ఫుడ్ వస్తువులు చూడాల్సిన రావడం ఎక్కడ గాజు పెంకులు చికెన్ ముక్కలు కాళ్లకు గుచ్చుకుంటాయి అన్న భయంతో వాటిని శుభ్రం చేసుకోవడంలో విద్యార్థిని విద్యార్థులు సతమతమవ్వాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని గ్రామ ప్రజలు కొందరు పేర్కొంటున్నారు. జీనపల్లి గ్రామం చుట్టూ సాగునీరు ఉండడం పాఠశాల సమీపంలోనే పంట కాలువ ఉండడం వల్ల అసలే దోమల తాకిడి ఉన్నదని ఈ మందు బాబులు తాగి పడేసిన వ్యర్థ పదార్థాల కారణంగా పంట పొలాల్లో మరియు పంట కాలువలో ఉన్నటువంటి ప్రమాదకరమైన దోమలు పాఠశాలలోకి ప్రవేశిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి జబ్బులు విద్యార్థులకు సంక్రమించే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు. శిరివెళ్ల మండల విద్యాశాఖ అధికారి సందర్శించాలని సచివాలయ మరియు శిరివెళ్ల పోలీసులు మందుబాబుల సిట్టింగును ప్రభుత్వ పాఠశాలలో లేకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు సూచిస్తున్నారు.
Comments