పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు, జనవరి 28 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీలు కర్నూలు జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ అద్యక్షులు మరియు జిల్లా ప్రదాన న్యాయమూర్తి జి. కబర్ధి పారా లీగల్ వాలంటీర్స్ ని నియమించండం కొరకు ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. కర్నూలు యూనిట్‌లో పనిచేయడానికి పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
అర్హతలు:
• అభ్యర్థి ఉమ్మడి కర్నూలు జిల్లా నివాసి అయి ఉండాలి.
• సామాజిక సేవ, చట్ట అవగాహన, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో ఉన్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కనీస విద్యార్హత:
• 10వ తరగతి పాసై ఉండాలి. పై స్థాయి విద్యార్హతలు, అనుభవం లేదా చట్ట మరియు సామాజిక సేవల రంగంలో పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
• ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యులు, న్యాయ విద్యార్థులు (వారు న్యాయవాదులుగా నమోదు చేసుకునే వరకు), రాజకీయేతర సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సామాజిక కార్యకర్తలు వంటి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ:
1. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను కర్నూలు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ/సంబంధిత మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయాల నుండి పొందవచ్చు.
2. పూరించిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాల ప్రతులను DLSA, కర్నూలు లేదా సంబంధిత మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయానికి స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపించాలి.
3. దరఖాస్తు పంపించాల్సిన చివరి తేది 05-02-2025 న 05.00 గంటల లోపు
4. సాయంత్రం 05.00 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం సాధ్యం కాదు.
దరఖాస్తును పంపించవలసిన చిరునామా
1. కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాదికార సంస్థ, కర్నూలు,
2. అద్యక్షులు, సంబంధిత మండల న్యాయ సేవాదికార సంస్థ