రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బిసి, ఎస్సి కార్పొరేషన్ ల ద్వారా సబ్సిడీ తో వంద శాతం ఋణాలు పంపిణీకి బ్యాంకర్ లు సహకరించండి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

బిసి, ఎస్సి కార్పొరేషన్ ల ద్వారా సబ్సిడీ తో వంద శాతం ఋణాలు పంపిణీకి బ్యాంకర్ లు సహకరించండి

>> 2024-25 వార్షిక ప్రణాళికలో భాగంగా బిసి లకు 2,800 యూనిట్లు, ఎస్సి లకు 678 యూనిట్ల మంజూరుకు చర్యలు చేపట్టండి..

>> యూనిట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఋణాలు మంజూరు చేయండి

- జిల్లా కలెక్టర్ చిత్తూరు



చిత్తూరు, జనవరి 17 (పీపుల్స్ మోటివేషన్):- రాష్ట్ర ప్రభుత్వం బిసి మరియు ఎస్సి వర్గాల వారి జీవనోపాధులు మెరుగుపరచడానికి సబ్సిడీతో బ్యాంక్ ఋణాలు మంజూరుకు కృషి చేస్తున్నదని, రుణాల మంజూరులో ప్రభుత్వం సూచించిన మేరకు వందశాతం లక్ష్యాలను సాధించడానికి బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.

 శుక్రవారం జిల్లా సచివాలయం లోని సమావేశ మందిరంలో బి.సి కార్పొరేషన్, ఎస్ సి కార్పొరేషన్ ఈడి లు మరియు బ్యాంకర్ లతో కలసి జిల్లా కలెక్టర్ స్పెషల్ డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు.  

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జీవనోపాధులు మెరుగుపరచే దిశగా బిసి, ఎస్ సి కార్పొరేషన్ లతో పాటు ఈబిసి, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య మరియు క్షత్రియ కార్పొరేషన్ ల ద్వారా సబ్సిడీతో ఋణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఆ మేరకు జిల్లాలోని బ్యాంక్ లకు రుణాల మంజూరులో లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. స్వయం ఉపాధి, జెనెరిక్ మందుల షాప్ లు ఏర్పాటు, ఎం ఎస్ ఎం ఈ కింద ఈ ఋణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రుణాల మంజూరులో అర్హతలను పూర్తిగా పరిశీలించాలన్నారు. బిసి లకు జెనెరిక్ మందుల షాపుల ఏర్పాటుకు, కాపు లకు ఎం ఎస్ ఎం ఈ ల కింద రుణాల మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎం ఎస్ ఎం ఈ కింద ప్రతి యూనిట్ లో 3 నుండి 5 మంది సభ్యులు ఉండేలా చూడాలన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి ఋణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ సబ్సిడీని 3 శ్లాబ్ లు గా విభజించి రాయితీ అందించబడుతుందన్నారు. స్వయం ఉపాధి కింద బి సి మరియు ఎస్ సి లకు వ్యవసాయం, పశు పోషణ, మోటార్ వాహనాల విభాగం, పరిశ్రమల స్థాపన, వ్యాపారం, ఇతర సేవలకు రుణాల మంజూరు చేస్తామన్నారు. 

 జిల్లాలో బిసి కార్పొరేషన్ తో పాటు ఈబిసి, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య మరియు క్షత్రియ కార్పొరేషన్ ల 2,800 యూనిట్లు, ఎస్. సి కార్పొరేషన్ ద్వారా 678 యూనిట్ల మంజూరుకు జిల్లాలోని బ్యాంకర్ లకు బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో బ్యాంకర్ లు చొరవ చూపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల అమలుకు తద్వారా ఆర్థిక అసమాతల తొలగింపుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న పథకాలకు బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తో రుణాల మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

      ఈ సమావేశంలో బిసి, ఎస్సి కార్పొరేషన్ ఈడి లు శ్రీదేవి, రాజ్యలక్ష్మి, ఎల్ డి ఎం హరీష్, జెడ్పి సిఈఓ రవికుమార్ నాయుడు, డి ఎల్ డి ఓ రవికుమార్, వివిధ బ్యాంక్ ల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-