రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Cancer: ఆ పాత్రలు క్యాన్సర్ కు కారణమవుతున్నాయా? ఈ విషయాలు మీకు తెలుసా?

Medical Experts Say These Kitchen Items Cause Cancer General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health
Peoples Motivation

Cancer: ఆ పాత్రలు క్యాన్సర్ కు కారణమవుతున్నాయా? ఈ విషయాలు మీకు తెలుసా?

>> క్యాన్సర్ కు కారణమవుతున్న వంటింట్లో వాడే వస్తువులు..

>> క్యాన్సర్ మానవాళిని పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి..

>> ప్లాస్టిక్, నాన్ స్టిక్ సామాగ్రి వాడొద్దని నిపుణుల హెచ్చరిక..

>> ఆ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

ప్లాస్టిక్, నాన్ స్టిక్ వంట సామాగ్రి, అల్యుమినియం పాత్రల వాడకం కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

నాన్-స్టిక్ వంట సామన్లు, సైలెంట్ కిల్లర్ గా పని చేస్తాయని నిపుణులు వెల్లడించారు. పాత్రలకు ఆహారం అంటుకోకుండా ఉండేందుకు కొన్ని హానికరమైన రసాయనాలతో తయారు చేస్తుంటారు. నాన్ స్టిక్ సామాగ్రి క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైనట్లు చెబుతున్నారు. అలానే ప్లాస్టిక్ కంటైనర్లు కూడా క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ పాత్రల్లో బిస్ఫినాల్ అనే యాసిడ్ కలిసి ఉంటుంది. ఈ పాత్రల్లో ఆహారపదార్థాలను తయారు చేసుకుని తింటే అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా హార్మోన్ల లోపాలు, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అలానే ఈ వస్తువులు క్యాన్సర్ వ్యాధికి కూడా దారి తీస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.

క్యాన్సర్ మానవాళిని పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఈ రోగం చాపకింద నీరులా వ్యాపిస్తూ ప్రాణాలను బలితీసుకుంటోంది. కార్సినోమా, సార్కోమా, లుకేమియా వంటి క్యాన్సర్ల బారిన పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, మద్యం సేవించడం వంటి కారణాలతో క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే వంటింట్లో వాడే వస్తువులు కూడా క్యాన్సర్ కు కారణమవుతున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

శుద్ది చేసిన చక్కెర ను వాడితే శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అలానే డబ్బాల్లో నిల్వ ఉన్న ఆహారం కూడా క్యాన్సర్స్ కు దారి తీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో కూడా వినియోగిస్తున్నారా? అయితే వాటి వినియోగాన్ని తగ్గించడమో లేదా పూర్తిగా ఇంట్లో నుంచి తీసేయడమో చేయాలంటున్నారు నిపుణులు. క్యాన్సర్ రాకుండా ఉండేందుకు అవిసె గింజలు, చియా విత్తనాలు, చేపలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Comments

-Advertisement-