రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Health Tips: మాంసాన్ని ఇలా తింటున్నారా అయితే మీరు సూపరే..?

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news benefits of panner losses of panner
Peoples Motivation

Health Tips: మాంసాన్ని ఇలా తింటున్నారా అయితే మీరు సూపరే..?

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news benefits of panner losses of panner

నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చికెన్, మటన్, చేపలు, సీ ఫుడ్ అన్ని రకరకాలుగా వండుకుని తింటారు. అయితే ఎలాంటి మాంసాహార పదార్థమైన అందులో నిమ్మకాయ మాత్రం పిండుకోకుండా ఉండలేరు. కొంతమందికి ఆనియన్, నిమ్మకాయ లేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్ పై నిమ్మరసం కలిపి తినడం మంచిదా కాదా ఇప్పుడు తెలుసుకుందా..

హోటల్లో రెస్టారెంట్లలో చికెన్, మటన్, ఫిష్ తినేటప్పుడు, నిమ్మరసాన్ని ముక్కలపై పిండుకోని తినడం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెబుతున్నారు. వంట చేసేటప్పుడు కూడా కూరల్లో లెమన్ జ్యూస్ మిక్స్ చేయొచ్చని, దీనివల్ల మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయని సూచిస్తున్నారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ నాన్వెజ్ ముక్కల్లోని ప్రొటీన్ను చిన్న చిన్న పార్టికల్స్ బ్రేక్ చేసి డైజేషన్ని సులువు చేస్తుంది. దీంతోపాటు నిమ్మకాయల్లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది కనుక ఫుడ్ నుంచి ఐరన్ను మరింత సమర్థవంతంగా అబ్సార్బ్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది. అందుకే బిర్యాని లాంటివి తినప్పుడు కుల్డ్రింక్ లకి బదులుగా నిమ్మరసం తాగిన చాలా మంచిది.

ఆ సమస్యలను నిమ్మరసం దూరం చేస్తుంది..

 చికెన్లో ఉండే లీన్ ప్రొటీన్, విటమిన్ B6, B12, కాల్షియం వంటివి మన శరీరానికి అందాలంటే విటమిన్ C తప్పనిసరి కావాలి. అందుకే చికెన్ పీస్లపై నిమ్మరసం పిండి తిన్నాలి. అలాగే నాన్ వెజ్ తింటే ఎదురయ్యే అజీర్తి, మలబద్దకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను కూడా నిమ్మరసం దూరం చేస్తుంది. చికెన్ మృదువుగా మారడానికి నిమ్మరసంలోని ఆమ్లత్వం ప్రోటీన్ బాగా పనిచేస్తుంది. దీంతో పాటు చికెన్ కి అదనంగా ఫ్లేవర్ని యాడ్ చేసి మరింత టేస్టీగా అనిపిస్తుంది.

ఆ సమస్యలు ఉన్న వారు పరిమితంగా తీసుకోవాలి..

 కానీ పల్ల సమస్య ఉన్న వారు ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఇబ్బందులతో బాధపడేవారు పరిమితంగా నిమ్మరసం వాడటం మంచిది. లేదంటే సమస్యలు మరింత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా పంటి సమస్య ఉన్నవారు కచ్చితంగా చికెన్, పులుపు తినడం తగ్గించాలి.

Comments

-Advertisement-