రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Jowar Roti: జొన్న రొట్టెతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!

Sorghum Bread Health Benefits Superfood For Those Who Want To Lose Weight Jowar Roti health benefits Sorghum Health tips jowar roti uses health news
Peoples Motivation

Jowar Roti: జొన్న రొట్టెతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!

>> జొన్న రొట్టెతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..

>> జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అధికం..

>> బరువు తగ్గాలనుకునే వారికి సూపర్ ఫుడ్..

>> జొన్నల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది..

>> షుగర్ ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది..

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news benefits of panner losses of panner

ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉదయం సాయంత్రం జొన్న రొట్టె కూరతో తినేవారు. కానీ ఇప్పుడు కాలానుగుణంగా చూసినట్లైతే ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరు ధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినే వారు. అందుకే ఆ కాలపు తరం వారు ఎంతో బలంగా ఉండే వారు. ఆరోగ్యంగా ఉండి వైద్యులను సంప్రదించే అవకాశమే ఉండేది కాదు. కానీ నేడు పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత రోజుల్లో మాదిరిగా జొన్న రొట్టెలు తింటే సంపూర్ణమైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అధికం..

జొన్న రొట్టెలతో పాటు జొన్న పిండితో చేసిన వంటకాలు ఏవైనా ఈజీగా జీర్ణమవుతాయి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. జొన్నల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. సగటున ఒక జొన్న రొట్టెలో 1.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపర్చేందుకు ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది. జొన్నల్లో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఎంతో మంచి చేస్తుంది. జొన్న రొట్టెలు తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులోని నియాసిన్, థయామిన్, రిబోఫ్లోవిన్ లాంటి బీ-కాంప్లెక్స్ విటమిన్స్ శక్తిని పెంచుతాయి.

జొన్నల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి..

జొన్న పిండితో చేసిన పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. జొన్నల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్ ను కంట్రోల్ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది.  జొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ శరీరంలో వాపును తగ్గించడంలో సాయపడతాయి. జొన్నల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 వంటి విటమిన్లు ఉండటం వల్ల ఎముకలకు ఎంతో బలం చేకూరుతుంది. జొన్న రొట్టెలను రోజు తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే జొన్న రొట్టెలను ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చ నిపుణులు సూచిస్తున్నారు.

Comments

-Advertisement-