రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Post Office Scheme: పోస్టాఫీసు లో రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు పొందండిలా!

Post Office Recurring Deposit Save Rs 166 Daily To Get Rs 8 Lakhs Post Office Scheme Health news health tips Telugu health benefits in Telugu health
Peoples Motivation

Post Office Scheme: పోస్టాఫీసు లో రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు పొందండిలా!

>> రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు అందుకోండి..

>> కనిష్టంగా రూ. 100 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది..

>> 6.7 శాతం వడ్డీ తో వస్తుంది ఇలా..

>> పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మీకోసం..

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news benefits of panner losses of panner

Post Office Scheme: తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను అందుకునేలా పోస్టాఫీస్ పథకాలను రూపొందించింది. పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ రిటర్న్ అందుకోవచ్చు. పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ లో బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో రోజుకు రూ. 166 పొదుపు చేస్తే చాలు ఏకంగా రూ. 8 లక్షలు చేతికి వస్తాయి. ఈ పథకం పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలివైన పెట్టుబడి మంచి రాబడులను తెచ్చిపెడుతుంది. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు అందుకోవచ్చు. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లాభాల సంగతి దేవుడెరుగు.. ఉన్నది ఊడ్చుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి భద్రతో కూడిన ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ప్రభుత్వ స్కీమ్స్ విషయానికి వస్తే.. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను దేశ ప్రజల కోసం అందుబాటులో ఉంచింది.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో సింగిల్ ఇండివిడ్యుయల్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకంలో కనిష్టంగా రూ. 100 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ఆధారపడి రాబడి ఉంటుంది. పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ మెచ్యూరిటీ కాల వ్యవధి 5 ఏళ్లు. ఎక్కువ కాలం పొదుపు చేయలనుకుంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో 6.7 శాతం వడ్డీ వస్తుంది.

రోజుకు రూ. 166 పొదుపుతో రూ. 8 లక్షలు:

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో రోజుకు రూ. 166 పొదుపు చేస్తే నెలకు రూ. 5 వేలు జమ అవుతుంది. అంటే ఏడాదికి రూ. 60 వేలు. ఇలా 5 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి మొత్తం రూ. 3 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం మీ పెట్టుబడిపై వడ్డీ రూ. 56,800 వస్తుంది. 5 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీకు మొత్తంగా రూ.3,56,800 వరకు చేతికి వస్తాయి. అయితే రూ. 8 లక్షలు పొందాలంటే మీరు ఈ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగించాల్సి ఉంటుంది. అప్పుడు ఇన్వెస్ట్ మెంట్ మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. దానిపై వడ్డీ రూ.2,54,300 వస్తుంది. మెచ్యూరిటీ కాలానికి చేతికి రూ. 8,54,300 వస్తుంది. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ బెటర్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.

Comments

-Advertisement-