Aadhar: సైబర్ నేరగాళ్లకు మీ ఆధార్ కార్డే ఆధారం.. తస్మాత్ జాగ్రత్త
Aadhar: సైబర్ నేరగాళ్లకు మీ ఆధార్ కార్డే ఆధారం.. తస్మాత్ జాగ్రత్త
• కార్డు దుర్వినియోగమైతే బ్యాంకు ఖాతాలు ఖాళీ..
• జాగ్రత్తలే భద్రతకు భరోసా..
ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడుతూ, నకలును ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా..? అయితే జాగ్రత్త ఇవి చాలాసార్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడమే కాకుండా ఆధార్, ఫోన్ నంబర్ల ఆచారంగా ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముంది.
'ఈ-ఆధార్' ఇబ్బందులు తప్పవా?
చాలా మంది డిజిటల్ సంతకంతో వచ్చే 'ఈ-ఆధార్ ను గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. దానిపై ఫోన్ నంబర్ ఉంటోంది. ఇది సైబర్ నేరగాళ్లకు చిక్కితే.. వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి, నిధులు కొట్టేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్ నంబరుతో కొత్త సిమ్ కార్డు సృష్టించి, అసలు సిమ్ కు బ్యాంక్ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ వేస్తారు. వారు సృష్టించిన సిమ్ కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు. పని పూర్తయిన తర్వాత ఆన్ బ్లాక్ చేసి, అసలు సిమ్ కార్డును పునరుద్ధరిస్తారు. బ్యాంకు ఖాతాలో మబ్బులు పోయిన సంగతే బాధితులకు తెలియదు.
ఈ జాగ్రత్తలు పాటించండి..
ఆధార్ కార్డ్ లేదా ఫోటోస్టాట్ తీసుకునే సందర్భంలో కొంత మంది ప్రింట్ సరిగా రాలేదని పక్కన పడేస్తారు. దానిని కూడా మనమే తీసుకుని ఇంటి దగ్గర ధ్వంసం చేసేయాలి. ఆధార్ కార్డులను అపరిచితులకు మెయిల్స్ వాట్సప్ చేయవద్దు చాలా సేవలకు చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపించే మాస్క్డ్ ఆధార్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆధార్ వెబ్సైట్ యూఐడీఏఐలో పీవీసీ కార్డును బుక్ చేసుకుంటే పోస్టులో ఇంటికే కార్డు వస్తుంది. ఇది క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో ఉంటుంది యూఐడీఏఐలో ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకుంటే ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం కాస్త తగ్గుతుంది ఆధార్, బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగించే సిమ్ ను వాట్సప్, టెలిగ్రామ్ వంటి వాటికి వినియోగించొద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటికి వచ్చిన గుర్తుతెలియని నెంబర్ల ను పొరపాటున క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముంది.