రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

APPSC: రేపే.. గ్రూప్‌ 2 పరీక్ష ఎలాంటి మార్పు లేదు

Group 2 TS Group 2 Syllabus Group 2 Notification APPSC Group 2 Group 2 Notification 2024 APPSC Group 2 Syllabus Group 2 Hall Ticket TS TET results Dsc
Peoples Motivation

APPSC: రేపే.. గ్రూప్‌ 2 పరీక్ష ఎలాంటి మార్పు లేదు

• ఏపీపీఎస్సీ కార్యాలయం దగ్గర పోలీస్ బందోబస్తు

• గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్

• ఆందోళన చేస్తారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు

• పరీక్ష వాయిదా వేసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏపీపీఎస్సీ సెక్రటరీ

Group 2 TS Group 2 Syllabus Group 2 Notification APPSC Group 2 Group 2 Notification 2024 APPSC Group 2 Syllabus Group 2 Hall Ticket TS TET results Dsc

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 పరీక్ష గందరగోళంలో పడింది. అసలు పరీక్ష ఉంటుందో పోస్టుపోన్ అవుతుందో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పరీక్షలు వందల కిలోమీటర్లు వెళ్లాల్సిన వాళ్లు వెళ్లిపోయారు. మరికొందరు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. 

గ్రూప్ 2 పరీక్ష పోస్టు ఫోన్ చేయాలని ప్రభుత్వం చెబుతున్నా ఆ విన్నపాలను ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏపీపీఎస్సీ ఛైర్‌పర్శన్ ప్రభుత్వం లేఖ రాసినా దానిపై ఇంత వరకు సమాధానం రాలేదు. ఇటు అభ్యర్థుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం అవుతోంది. 

రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయని గ్రహించిన ప్రభుత్వం అభ్యర్థలు కోరిక మేరకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. శుక్రవారమే ఆ లేఖను ఏపీపీఎస్సీకి రాసింది. లేఖ రాసి 24గంటలు అవుతున్నా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గ్రూప్ 2 పరీక్ష కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటన చేయలేదు.

ప్రభుత్వం లేఖ రాయడమే కాకుండా ఇద్దరు నేతలను కూడా ఏపీపీఎస్సీ ఛైర్‌పర్శన్ వద్దకు పంపించారు. ఆరోగ్యం బాగాలేదని ఆమె కలవలేదు. దీంతో వాళ్లిద్దరు తిరిగి వచ్చేశారు. విషయాన్ని ప్రభుత్వానికి చెప్పారు. తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని చాలా మంది అభ్యర్థులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. మధ్యాహ్నం వరకు ఓపిక పట్టిన ప్రభుత్వం లేఖ రాసిన విషయాన్ని మీడియాకు తెలియజేసింది. 

ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఏపీపీఎస్సీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఛైర్‌పర్శన్‌ కూడా అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీపీఎస్సీ ఫోన్ నెంబర్లు కూడా పని చేయడం లేదు. మీడియా సంస్థలకు అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పాలని రిక్వస్ట్‌లు చేస్తున్నారు. 

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏపీపీఎస్సీ ఛైర్‌పర్శన్‌గా అనురాధను నియమించారు. సిన్సియర్ ఆఫీసర్‌గా ఆమెకు పేరు ఉంది. ఏపీపీఎస్సీ కూడా స్వతంత్ర సంస్థ. దీన్ని రాజకీయ ఒత్తిళ్లు లేకుండా నడపాలనే ఉద్దేశంతో ఆమెను తీసుకొచ్చి ఈ పోస్టులో పెట్టారు. ఇప్పుడు ఆమె ప్రభుత్వం మాట వినడం లేదని అంటున్నారు. ఆమె తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంసతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

గ్రూప్ -2 పరీక్షలపై సంచలన ప్రకటన

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది.

గ్రూప్-2 అభ్యర్థుల ధర్నా..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గ్రూప్-2 అభ్యర్థులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. రేపు జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ వారు రోడ్లెక్కారు. విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కాగా గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జాము యథాతథంగా నిర్వహిస్తామని ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మార్చే ప్రసక్తే లేదని తెలిపింది.

Comments

-Advertisement-