ప్రభుత్వం అందించే సబ్సిడీ ఋణాలను సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వం అందించే సబ్సిడీ ఋణాలను సద్వినియోగం చేసుకోండి
• బీసీ, కాపు, వైశ్య, కమ్మ, బలిజ, రెడ్డి, ఈడబ్యుఎస్ కు చెందిన వారికి అవకాశం
నంద్యాల, ఫిబ్రవరి 04 (పీపుల్స్ మోటివేషన్):- పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి ని పెంపొందిస్తూ సబ్సిడీ ఋణాలను అందిస్తాం
నంద్యాల ప్రజలు ఈ సబ్సిడీ ఋణాలను సద్వినియోగం చేసుకొని వ్యాపార రంగంలో అభివృద్ధి చెందలాని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కోరారు.
ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా
తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమం కొరకు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ ఋణాల కార్యక్రమం ప్రారంభించడం జరిగిందిని . సబ్సిడీ రుణాలపై అవగాహన సదస్సులో ఫిరోజ్ తెలిపారు . తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ నాయకులకు కార్యకర్తలకు ఈ సబ్సిడీ ఋణాలపై నిపుణులచే అవగాహన కల్పించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బీసీల సంక్షేమం కొరకు ఇచ్చిన మాటను నిజం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలను వెచ్చించి బీసీలలోనున్న నిరుద్యోగ యువతను స్వయం ఉపాధిలో పెంపొందించేందుకు వ్యాపారస్తులు వ్యాపారంలో మరింత స్థిరపడే విధంగా తోడ్పాటుగా సబ్సిడీ ఋణాలను అందించడం జరుగుతుందన్నారు.
తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి బీసీల సంక్షేమం కోసం ఎంతవరకైనా కృషి చేస్తుందని మరోసారి రుజువైందన్నారు. గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడ సబ్సిడీ ఋణం అందించి సహకరించకుండా దగా చేసిందన్నారు.
తెలుగు దేశం పార్టీ పేద ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు,రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఐదేళ్లలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగ యువత స్వయం ఉపాధిని పెంపొందిస్తూ వ్యాపారంలో స్థిరపడేలా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని ప్రత్యేకంగా సబ్సిడీ రుణాలు అందిస్తోందన్నారు.
ఈ సబ్సిడీ ఋణాలతో అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు తక్కువ వడ్డీ రుణాలతో వ్యాపార అభివృద్ధికి ఆర్థిక మద్దతుదందించి ప్రతి కుటుంబాన్ని ఆర్ధికంగా బలపరిచే కార్యక్రమం అన్ని వర్గాల ప్రజలు సమగ్ర అభివృద్ధి చేందేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇది కేవలం రుణ పథకం కాదని ఇది మీ భవిష్యత్తును నిర్మించే అవకాశమని , ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగాన్ని తొలగించే క్రమంలో చంద్రన్న ప్రభుత్వం సాగుతుందన్నారు.. దానితోపాటు గత ఎన్నికలలో తన ప్రాణాలను సైతం లెక్కచేయ్యకుండా నిరంతరం కృషి చేస్తూ తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన కార్యకర్తలు కూడా ఈ సబ్సిడీ ఋనాలను పొంది అభివృద్ధి చెందాలని ఈ సందర్బంగా తెలిపారు.
నంద్యాల ప్రజలందరికి తోడుంటాం అందరిని ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామని మన ప్రాంత ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తును కల్పిస్తామని ఎన్ ఎం డి ఫిరోజ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు , టిడిపి నంద్యాల పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్ , కౌన్సిలర్ ఖండే శ్యాం సుందర్ లాల్, మహిళ అధ్యక్షురాలు విజయగౌరీ , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పై తెల్పిన విధంగా అర్హతలున్న వారు https://apobmms.apcfss.in వెబ్ సైట్ (ఆన్ లైన్) నందు తేదీ తేదీ 30.01.2025 నుండి 07.02.2025 లోగావారి పేర్లను APOBMMS వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవలసినదిగా ఇందుమూలముగా తెలియజేయడమైనది.