వ్యవసాయం& గ్రామీణ శ్రేయస్సుపై ప్రధానమంత్రి వెబినార్ కార్యక్రమం..
వ్యవసాయం& గ్రామీణ శ్రేయస్సుపై ప్రధానమంత్రి వెబినార్ కార్యక్రమం..
కర్నూలు, ఫిబ్రవరి 28 (పీపుల్స్ మోటివేషన్):-
డిపార్ట్మెంట్ అఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సంయుక్త ఆధ్వర్యంలో "వ్యవసాయం మరియు గ్రామీణ శ్రేయస్సు" అంశంపై ముఖ్యమైన వెబినార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా రైతులతో ముఖాముఖి చర్చ చేయనున్నారు.
కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్. ఆర్. రామచంద్రరావు తెలియజేసిన వివరాల ప్రకారం. ఈ కార్యక్రమం కర్నూలులోని ఉద్యాన భవనం, ఏ- క్యాంపు ప్రాంగణంలో రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించినట్లుగా, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ద్వారా అందించబడే వ్యవసాయ వడ్డీ రుణ రాయితీ 23 లక్షల నుండి 35 లక్షలకు పెంచనున్నట్లు తెలియజేశారు. దీని ద్వారా వ్యవసాయ రంగంలో స్వల్పకాలిక రుణాలు మరింత పెరిగి, రైతులకు ఉపయోగపడతాయి.
ప్రస్తుతం వ్యవసాయ క్రెడిట్ సంబంధిత ప్రధాన సవాళ్లు:
• క్రెడిట్ పరిమితిలో సవరణల తక్కువగుండడం 2006-07 నుండి రుణ పరిమితి మార్పులేకుండా ఉంది. పెరిగిన సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని సవరించాల్సిన అవసరం ఉంది.
• అనధికారిక రుణ వనరులపై ఆధారపడటం నాబార్డ్ నివేదిక 2022 ప్రకారం, 25% వ్యవసాయ రుణాలు అధిక వడ్డీ రేట్లతో వ్యవసాయేతర వనరుల ద్వారా లభిస్తున్నాయి.
• పశు సంవర్ధక, మత్స్యకార రైతులకు తక్కువ రుణ పరిమితి ప్రస్తుతం వ్యవసాయ కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి 3 లక్షలు కాగా, పశు సంవర్ధక మరియు మత్స్యకార రైతులకు ఇది ₹2 లక్షలుగా ఉంది. దీని వల్ల సంబంధిత రంగాలలో పెట్టుబడులు తగ్గుతున్నాయి.
• వర్షాధారిత మరియు గిరిజన ప్రాంతాల్లో అసమాన క్రెడిట్ వితరణ చాలా ప్రాంతాల్లో వ్యవసాయ రుణ ప్రాప్తి తగ్గిపోతోంది. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రుణ పరిమితి పెంపుతో రైతులకు కలిగే ప్రయోజనాలు:
* 2023-24లో వ్యవసాయ రుణ లబ్ది ₹9.81 లక్షల కోట్ల నుంచి 2029-30 నాటికి ₹20 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది.
* అధిక విలువ గల ఉద్యానవన, వాణిజ్య పంటలు, డెయిరీ, పౌల్ట్రీ, మత్స్యకార్యకలాపాల్లో పెట్టుబడులు పెరుగుతాయి.
* రైతులు మెరుగైన విత్తనాలు, ఎరువులు, యాంత్రీకరణ, పోస్ట్- హార్వెస్ట్ సదుపాయాలు పొందేందుకు మరింత క్రెడిట్ వాడుకునే అవకాశం ఉంటుంది.
* ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి ఎం ఎఫ్ బి వై) మరియు పశువుల బీమా పథకాలతో కెసిసి ని సమగ్రంగా అనుసంధానించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
కర్నూలు జిల్లాలోని రైతులు, డీడీఎం నాబార్డ్, వ్యవసాయ శాఖ పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.ఆర్. రామచంద్రరావు తెలియజేశారు.
