Budget: రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా బడ్జెట్..
Budget: రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా బడ్జెట్..
-రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ లో అన్ని రంగాలు - వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించడం మంచి పరిణామం...
• అభివృద్ధి – సంక్షేమాల కలబోతగా బడ్జెట్ ను రూపొందించిడంతో బడ్జెట్ కేటాయింపుల్లో సమతుల్యత కనిపిస్తోంది...
• అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు చేయడం సంతోషకరం...
• అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు నిధుల కేటాయింపుల ద్వారా ప్రజలకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు - సూపర్ సిక్స్ అమలులో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం..
• మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేలా, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిచ్చేలా బడ్జెట్ లో కేటాయింపులున్నాయి..
• 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి రవాణా శాఖతో కలిపి రహదారులు & భవనాల శాఖకు 8,785 కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది..
• గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో ప్రజలు 5 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించారు..
• కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 శాతంపైగా రోడ్ల మరమ్మతులను కేవలం 3 నెలల్లో చేపట్టగలిగాం..
• ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని రోడ్లను తీర్చిదిద్దడం ద్వారా ఆర్ & బీ శాఖకు పూర్వవైభవం తీసుకొస్తాం..
• రాష్ట్రంలో రహదారులు & వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుల క్రింద 2,522 కి.మీ రహదారుల విస్తరణ పనులు.. 464 వంతెనల నిర్మాణ/పునర్నిర్మాణ పనులు త్వరలో చేపట్టనున్నాం..
• రాష్ట్రంలో రహదారులు వంటి కీలక రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పెట్టుబడులు ఆకర్షించేందుకు, టూరిజం వంటి రంగాల అభివృద్ధికి దోహదమవుతోంది..
