రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

CBSE ఇకపై ఏటా 2సార్లు పదో తరగతి పరీక్షలు

cbse.gov.in 2025 Class 10 results CBSE private candidate Admit Card 2025 Cbseit.in res cbse.gov.in results CBSE results Download CBSE 12 class results
Peoples Motivation

CBSE ఇకపై ఏటా 2సార్లు పదో తరగతి పరీక్షలు

• ఫిబ్రవరి 17-మార్చి 6 వరకు మొదటి విడత..

• మే5-మే20 వరకు రెండో విడత సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు..

• ముసాయిదాలోని కీలక అంశాలు ఇవే!

cbse.gov.in 2025 Class 10 results CBSE private candidate Admit Card 2025 Cbseit.in res cbse.gov.in results CBSE results Download CBSE 12 class results

CBSE: కేంద్రం నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా 2026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను ఏడాదిలో 2 సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలతో సీబీఎస్‌ఈ ఓ పబ్లిక్‌ నోటీస్‌ను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఫిబ్రవరి - మార్చిలో మొదటి విడత పరీక్షలు; మే నెలలో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు అందులో స్పష్టం చేసింది. ఈ రెండు పరీక్షలూ పూర్తిస్థాయి సిలబస్‌తోనే నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ముసాయిదాలో స్పష్టంగా పేర్కొంది.

ప్రాక్టికల్స్ మాటేమిటి?

సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించినప్పటికీ, ప్రాక్టికల్స్‌/ అంతర్గత మూల్యాంకనం మాత్రం ఒకేసారి చేయనున్నట్లు తెలిపింది. ఈ తరహా విధానం విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకొనే అవకాశం కల్పిస్తుందని తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సీబీఎస్ఈ వెల్లడించింది. విస్తృతమైన చర్చల అనంతరం రూపొందించిన ఈ ముసాయిదాను తమ వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపింది. ఈ ముసాయిదా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మార్చి 9లోగా తమ అభిప్రాయాలను చెప్పవచ్చని బోర్డు సూచించింది.

ఈ విధంగా తమకు వచ్చిన స్పందనలను పరిశీలించిన తర్వాత, ఈ ముసాయిదాను సమీక్షించి, సవరిస్తామని, తరువాత తుది రూపం ఇచ్చి ఖరారు చేయనున్నట్లు సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ డాక్టర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ తెలిపారు. ఈ ముసాయిదా ప్రకారం, 2026 నుంచి సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు మొదటి విడత, మే 5 నుంచి 20 వరకు రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో పాటు ముసాయిదా డేట్‌ షీట్స్‌ను సైతం విడుదల చేసింది సీబీఎస్ఈ.

Comments

-Advertisement-